Balakrishna-Prabhas: బాలకృష్ణకు తల్లిగా, ప్రభాస్‍కు ప్రియురాలిగా నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఒక్క సినిమాకు కోట్లు డిమాండ్..

సినీరంగంలో హీరోయిన్లుగా వెండితెరను ఏలిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సహయ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమకంటే పెద్ద వయసున్న హీరోల సరసన నటించి భారీ హిట్స్ అందుకున్న ముద్దుగుమ్మలు.. తమకంటే చిన్నవారితోనూ జత కట్టారు. కానీ మీకు తెలుసా.. ? బాలకృష్ణకు తల్లిగా కనిపించిన ఓ హీరోయిన్.. యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రియురాలిగా కనిపించింది.

Balakrishna-Prabhas: బాలకృష్ణకు తల్లిగా, ప్రభాస్‍కు ప్రియురాలిగా నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఒక్క సినిమాకు కోట్లు డిమాండ్..
Balakrishna, Prabhas

Updated on: May 16, 2025 | 4:33 PM

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డార్లింగ్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ హిట్ తర్వాత ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రియురాలిగా నటించిన ఓ హీరోయిన్.. నందమూరి హీరో బాలకృష్ణకు తల్లిగా నటించిందని మీకు తెలుసా..? ప్రస్తుతం ఆమె సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అంతేకాకుండా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇంతకీ బాలయ్యకు తల్లిగా, ప్రభాస్ లవర్ గా కనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార.

ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరు. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసిన ఈ అమ్మడు క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నయన్.. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఇటీవల ఆమె నటించిన టెస్ట్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 20 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయన్ డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. గతంలో ప్రభాస్ నటించిన యోగి చిత్రంలో నయన్ కథానాయికగా నటించింది. 2007లో విడుదలైన ఈ మూవీలో ప్రభాస్ ప్రియురాలిగా కనిపించింది నయనతార. ఆ తర్వాత 2010లో బాలకృష్ణ నటించిన సింహా చిత్రంలోనూ నయన్ నటించింది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఇందులో బాలయ్యకు భార్యగా.. ఆ తర్వాత తల్లిగా కనిపించారు. అలా బాలయ్యకు తల్లిగా, ప్రభాస్ లవర్ పాత్రలలో కనిపించిన ఏకైక హీరోయిన్ నయనతార.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..