Tollywood : బిస్లరీ వాటర్‌తో స్నానం.. ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరకు ఆస్తులన్నీ దానం చేసిన హీరోయిన్..

సినీ రంగుల ప్రపంచంలో వెండితెరపై కనిపించినంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు. ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారు. అంతేకాదు నిజమైన ప్రేమ కోసం పోరాడి.. చివరకు భర్త చేతిలో మోసానికి గురై.. లేదా బాధలు అనుభవించిన వారు ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.

Tollywood : బిస్లరీ వాటర్‌తో స్నానం.. ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరకు ఆస్తులన్నీ దానం చేసిన హీరోయిన్..
Srividya

Updated on: May 28, 2026 | 9:04 PM

భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటీమణులలో శ్రీవిద్య ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా, ఆపై అక్క, చెల్లి, అమ్మ, అత్త వంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి సుమారు 800కు పైగా సినిమాల్లో నటించి ఆమె అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా తన మధురమైన గాత్రంతో, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ అలరించారు. అప్పట్లో స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ , స్టార్‌డమ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. శ్రీవిద్య స్టార్‌డమ్ ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. ఒక తెలుగు సినిమా షూటింగ్ కోసం ఆమె రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో గోదావరి నదికి వరదలు రావడంతో నీరు చాలా బురదగా మారింది. సెట్‌లోని సహాయకులు ఆ నీటిని సాంప్రదాయ పద్ధతిలో తేటగా చేసి నటీనటులకు స్నానాల కోసం ఇచ్చేవారు. అయితే, శ్రీవిద్య మాత్రం ఆ బురద నీటితో స్నానం చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆ నీటి వల్ల తన శరీర సౌందర్యం, ఆరోగ్యం దెబ్బతింటుందని భావించి పేచీ పెట్టారట.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

దీంతో చేసేదేమీ లేక చిత్ర నిర్మాతలు అప్పట్లోనే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ‘బిస్లరీ’ మినరల్ వాటర్ బాటిళ్లను భారీగా తెప్పించారు. అప్పట్లో లీటర్ బిస్లరీ బాటిల్ ధర ఆరు రూపాయలు. అలాంటి వందలాది బాటిళ్లను కొనుగోలు చేసి, బకెట్లలో నింపి రెండు పూటలా ఆమె స్నానానికి అందించేవారు. ఈ సంఘటన అప్పట్లో సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. సినిమాల్లో ఇంతటి వైభవాన్ని చూసిన శ్రీవిద్య వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో విచారకరమైన ఒడిదొడుకులతో సాగింది. కట్టుకున్న భర్త ఆమె ప్రేమను కాకుండా కేవలం ఆస్తులనే ఆశించాడు. చివరికి ఆమెను వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. దీనితో శ్రీవిద్య కోర్టుకు వెళ్లి సుదీర్ఘ పోరాటం చేసి తన ఆస్తులను వెనక్కి తెచ్చుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ 2003లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు.

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

క్యాన్సర్ నాల్గవ స్టేజ్‌కు చేరుకున్నాక తాను ఇక బతకడం కష్టమని గ్రహించిన శ్రీవిద్య, ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మీద ఒక్క రూపాయి కూడా ఉంచుకోకూడదని భావించి, తన ఆస్తిపాస్తులన్నింటినీ వివిధ చారిటబుల్ ట్రస్టులకు, పేదలకు, అనాథల సేవలకు దానంగా రాసిచ్చేశారు. సుమారు మూడేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడిన శ్రీవిద్య 2006, ఆగస్టు 17న తన 53వ ఏట కన్నుమూశారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, తన దానగుణంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి నేటికీ ఆదర్శంగా నిలిచారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

హీరోయిన్ శ్రీవిధ్య ఫోటో.. 

Srividya News

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

 

Follow Us