Tollywood: ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు 5 నిమిషాలు కనిపిస్తే రూ.5 కోట్లు రెమ్యునరేషన్..

|

Dec 11, 2024 | 7:40 AM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. ఆమె చేసే ఒక్క స్పెషల్ సాంగ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోహీరోయిన్లకు పోటీగా పారితోషికం తీసుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Tollywood: ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు 5 నిమిషాలు కనిపిస్తే రూ.5 కోట్లు రెమ్యునరేషన్..
Actress
Follow us on

సినీరంగుల ప్రపంచంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అనేక విమర్శలు, అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొని తనదైన నటనతో మెప్పించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక కొందరు అమ్మాయిలు మాత్రం బాడీ షేమింగ్ కామెంట్స్, అవమానాలను భరించి ఆత్మవిశ్వాసంతో ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. సినిమాల్లో ఆఫర్ ఇచ్చాక.. చెప్పకుండానే తొలగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చాలా మంది తారలు ఇంటర్య్వూలలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయిన్ల రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఓ అమ్మడు. ఒకప్పుడు ఆమె హీరోయిన్ ఏంట్రా అన్నవాళ్లు.. ఇప్పుడు ఆమె డేట్స్ కోసం స్టార్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక్క సినిమాలో ఆమె ఐదు నిమిషాలు కనిపించాలంటే ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ చెల్లించాల్సిందే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.

సినిమాల్లో ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి వెండితెరపై సందడి చేసింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు చేసే స్పెషల్ సాంగ్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన దిల్బర్ దిల్బర్ సాంగ్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. కానీ ఈ పాటకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట.

హిందీలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నోరా ఫతేహి. ఆ తర్వాత యంగ్ రెబల్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్లకు ధీటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ అమ్మడు.. కెరీర్ ఆరంభంలో మాత్రం ముంబైలో ఓ చిన్న ప్రాంతంలో ఇరుకైన గదిలో ఉండేదట. జూనియర్ ఆర్టిస్టు, ట్రూప్ డాన్సర్ గా పనిచేసింది. ఆ సమయంలో ఆమెకు బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా హీరోగా నటించిన రోర్ సినిమా ద్వారా ఆమెకు మొదటి అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్క స్పెషల్ సాంగ్ చేయడానికి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.