
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రహీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్నప్పుడే తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చిన ప్రత్యూష్.. ఒక టీవీ రియాల్టీ షోలో పాల్గొని శ్రీమతి లవ్లీ స్మైల్ అనే బిరుదును గెలుచుకుంది. అప్పట్లో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. 1998లో మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో మోహన్ బాబు కూతురిగా కనిపించింది. ఆ సమయంలోఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. కేవలం రెండేళ్లల్లో ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆమెకు వరుస సినిమాలు క్యూ కట్టాయి. తెలుగులో రాయుడు, శ్రీరాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో హీరోయిన్ గా ఎదుగుతున్న రోజులు అవి. కేవలం 5 ఏళ్లల్లో 11 సినిమాల్లో నటించింది. అలాగే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ప్రత్యూష.
కానీ ఆకస్మాత్తుగా ఆమె చనిపోయిందన్న మరణవార్త ఇండస్ట్రీని కుదిపేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2002లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే వార్తలు ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ప్రత్యూష మరణించినప్పుడు ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.
Prathyusha News
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..