Tollywood: 17 ఏళ్లకే తెలుగులో ఫస్ట్ మూవీ.. ఆపై 2సార్లు విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్లి.. ఎవరంటే..

|

Dec 07, 2024 | 6:41 PM

తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 17 ఏళ్లకే తెలుగులో సెకండ్ హీరోయిన్ గా అడుగుపెట్టింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే 22 కంపెనీలను కలిగి.. 2 సార్లు విడాకులు తీసుకున్న 2 కుమార్తెలు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: 17 ఏళ్లకే తెలుగులో ఫస్ట్ మూవీ.. ఆపై 2సార్లు విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్లి.. ఎవరంటే..
Actress
Follow us on

సినీరంగంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా పేరు సంపాదించుకుంది. కానీ పెళ్లి తర్వాత ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొంది. ఎందుకంటే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే 2 సార్లు విడాకులు తీసుకుని.. ఇద్దరు కూతుర్లు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడికి 22 కంపెనీలు ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ తెలుసా.. తనే నేహా పెండ్సే. ఇలా పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ సొంతం సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

నేహా అసలు పేరు శుభాంగి. బిగ్ బాస్ సీజన్ 12లో ప్లాగొంది. బుల్లితెరపై అనేక సీరియల్స్, షోస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల నుండి డబ్బు సంపాదిస్తుంది. ‘ఐ కమ్ ఇన్ మేడమ్’ , ‘భాబీజీ ఘర్ పర్ హైన్!’ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 29 ఏళ్లు అవుతోంది. ఇండస్ట్రీలో ఎన్నోసార్లు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంది.

1995లో ఏక్తా కపూర్ టీవీ షో ‘కెప్టెన్ హౌస్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. 1999లో ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె సౌత్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆర్యన్ రాజేశ్, నమిత జంటగా నటించిన సొంతం సినిమాలో రోహిత్ ప్రేయసిగా నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 17 ఏళ్లే. తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ భాషలలో నటించింది.

నేహా 2020లో వ్యాపారవేత్త శార్దూల్ సింగ్ బియాస్‌ను వివాహం చేసుకుంది. నేహాని పెళ్లి చేసుకోకముందే శార్దూల్ రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. నేహా మూడో భార్య కావడంతో అప్పట్లో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేశారు. కేవలం డబ్బుల కోసమే ఆ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందని విమర్శలు వచ్చాయి. నేహా పెండ్సే భర్త శార్దూల్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త. 22 కంపెనీలను కలిగి ఉన్నాడు. నివేదికల ప్రకారం, అతని నికర విలువ 125 మిలియన్ US డాలర్లు. నేహా పెండ్సే భర్త సంపద పదిన్నర వేల కోట్ల రూపాయలకుపైగా ఉంటుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.