Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‏తో కెరీర్ క్లోజ్.. సన్యాసిగా మారి ఇప్పుడు సినిమాల్లోకి..

ఇండస్ట్రీలో ఒకప్పుడు తోపు హీరోయిన్. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఒకే ఒక్క ప్రమాదం ఆమె జీవితాన్ని తారుమారు చేసింది. అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఆమె.. జ్ఞాపకశక్తి కోల్పోయి కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత సన్యాసిగా మారి హిమాలయ పర్వతాల్లోకి వెళ్లిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది.

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‏తో కెరీర్ క్లోజ్.. సన్యాసిగా మారి ఇప్పుడు సినిమాల్లోకి..
Anu Aggarwal

Updated on: May 29, 2025 | 12:06 PM

సినీరంగంలో 1990లలో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసింది. కానీ వ్యక్తిగత కారణాలతో కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాల నుంచి తప్పుకున్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. దీంతో జ్ఞాపకశక్తి కోల్పోయి కొన్నాళ్లు కోమాలోనే ఉండిపోయింది. ఆ తర్వాత సన్యాసిగా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే అను అగర్వాల్. 1990లో వచ్చిన ఆషికి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. మహేష్ భట్ తెరకెక్కించిన ఆషికీ సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమా అప్పట్లో రాహుల్, అనులకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కాజోల్, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోహీరోయిన్లతోపాటు అనుకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ 1999లో జరిగిన ఓ ప్రమాదంతో ఆమె దాదాపు 29 రోజులు కోమాలో ఉండిపోయింది. ఆ తర్వాత తన జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆషికీ సినిమా చూస్తూ తనకు ఏం గుర్తులేదని చెప్పుకొచ్చింది. 2001లో సన్యాసిగా జీవించాలనుకుని పర్వతాలకు వెళ్లిపోయింది. కొన్నేళ్లు అక్కడే గడిపిన ఆమె తిరిగి ముంబై వచ్చేసింది. ఇప్పుడు యోగా సాధన చేస్తుంది.

ఇక ఇప్పుడు అను తిరిగి సినిమాల్లోకి రావాలని చూస్తుంది. కొన్ని రోజులుగా ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఆషికీ సినిమా తర్వాత అను అగర్వాల్ షారుఖ్ ఖాన్, జాకీ ష్రాఫ్ నటించిన కింగ్ అంకుల్, మణిరత్నం దర్శకత్వం వహించిన తిరుడా తిరుడా, జయప్రద, జీతేంద్ర నటించిన ఖల్-నైకా వంటి చిత్రాల్లో నటించింది. అశోక్ కుమార్, దేవ్ ఆనంద్, ధర్మేంద్ర, జాకీ ష్రాఫ్, శిల్పా శిరోద్కర్, మధు నటించిన 1996 మల్టీస్టారర్ చిత్రం రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్, అను అగర్వాల్ ఇప్పటివరకు తెరపై కనిపించిన చివరి చిత్రం.

Anu Aggarwal News

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..