
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు నెగిటివ్ రోల్స్ లోనూ నటించి మెప్పించిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది విలన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతోమంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు కూడా ఒకరు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమాల్లో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే భార్యకు విడకులు ఇచ్చి 57 ఏళ్ల వయసున్న ఆయన 24ఏళ్ల అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆతర్వాత ఆమెతో కూడా విడిపోయాడు. ప్రస్తుతం అతను విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?
పెళ్లీ ఫేమ్ పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సహనటుడుగా.. ప్రతి నాయకుడిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు పృథ్వీ. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అప్పట్లో పృథ్వీ వ్యక్తిగత జీవితంకారణంగా వార్తల్లో నిలిచాడు. పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల శీతల్ అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పటికే పెళ్లయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. దాదాపు 20ఏళ్లు కాపురం చేసిన తర్వాత వీరు విడిపోయారు. ఆతర్వాత ఆయన 23 ఏళ్ల అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. అప్పటికే ఆయన వయసు 57ఏళ్లు.
కాగా గతంలో ఆ వార్తలపై స్పందించారు పృథ్వీ. అయితే ఆ అమ్మాయికి 23 ఏళ్లు కాదని.. 24 అని.. అలాగే.. ఇంకా తమకు పెళ్లి కాలేదని.. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని..శీతల్ మలేషియాకు చెందిన యువతి కాదని.. తెలుగమ్మాయి అని స్పష్టం చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని కూడా చెప్పుకొచ్చాడు. ముందు నేను పెళ్లి కి ఒప్పుకోలేదు. ఆలోచించుకోమని చాలా సమయం ఇచ్చాను. కానీ ఆమె నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకు ఆమె కుటుంబం కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఏ వయసులో ప్రేమలో పడతారో చెప్పలేరు అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. త్వరలోనే శీతల్ ను వివాహం చేసుకుంటానని.. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నామని.. తనపై నమ్మకం ఉందని అన్నారు.. కానీ ఆతర్వాత ఈ ఇద్దరు కూడా విడిపోయారు, ప్రస్తుతం పృథ్వీ సింగిల్ గా ఉంటున్నారు. మొన్నామధ్య వచ్చిన యానిమల్ సినిమాతో మరోసారి ఆయన పేరు మారుమ్రోగింది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం, సన్ ఆఫ్ వైజయంతీ, విజయ్ సేతుపతి ఆస్ సినిమాల్లో నటించాడు పృథ్వీ.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి