AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో తోప్ హీరో.. రీసెంట్‌గా రూ.300కోట్ల భారీ హిట్ కొట్టాడు

సినిమా హీరోల చిన్న నటి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీల ఫోటోలను నెటిజన్స్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. చిన్న నటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు రెగ్యులర్ గా అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు.

ఈ ఫొటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో తోప్ హీరో.. రీసెంట్‌గా రూ.300కోట్ల భారీ హిట్ కొట్టాడు
Tollywoo Movie
Rajeev Rayala
|

Updated on: Aug 11, 2025 | 11:25 AM

Share

చైల్డ్ ఆర్టిస్ట్ లుగా వెండి తెరపై అడుగు పెట్టి.. అనేక సినిమాల్లో నటించిన వారు చాలా మంది ఉన్నారు.  నటించి ప్రేక్షకులను మెప్పించి పెరిగి పెద్దయ్యాక స్టార్ హీరో, హీరోయిన్స్ గా రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు.. మరొకొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా అనుకోకుండా ఒకటి రెండు సినిమాల్లో కనిపించి.. వెండితెరకు పరిచయమై.. కాలక్రమంలో టాలీవుడ్‌లో హీరోలుగా అడుగు పెట్టి.. స్టార్ హీరోల రేంజ్ కు చేరుకున్నారు. తమ నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. కమల్ హాసన్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, తారక్ వరకూ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు.  ఇప్పుడు స్టార్ హీరోలుగా వెండి తెరను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాలనటుడు ఎవరో గుర్తు పట్టారా.. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా.. కానీ గుర్తుపట్టడం కొంచెం కష్టమే.. ఎందుకంటే నేటి స్టార్ హీరో.. చైల్డ్ ఆర్టిస్టుగా ఒకే ఒక సినిమాలో నటించాడు మరి. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

అతనే ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడు, స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ప్రేమ నగర్ లో వెంకటేష్ బాల నటుడిగా కనిపించారు. ఈ సినిమా 1971లో విడుదలైన అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ఏఎన్నార్ అన్న పాత్రలో సత్యనారాయణ నటించారు. కేశవ్ వర్మ సత్యనారాయణ చిన్న నాటి పాత్రలో వెంకటేష్ కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

1986లో కలియుగ పాండవులు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన వెంకటేష్ అనేక సూపర్ హిట్ సినిమాలను అందుకుని విక్టరీని తన పేరుగా మార్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వెంకటేష్ ఇప్పటికీ విభిన్న కథలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంటున్నాడు. ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు చేసిన హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు వెంకటేష్. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ. ఇప్పుడు చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో గెస్ట్ గా కనిపించనున్నాడు. అలాగే బాలకృష్ణతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు వెంకటేష్.

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి