AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు హోటల్లో సర్వెంట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్.. చివరకు తండ్రి కోసం..

మూడు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పిన హీరో. ఇప్పటివరకు దాదాపు 100 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ హోటల్ సర్వెంట్ కొడుకు అతడు. హీరోగానే కాకుండానే విలన్ పాత్రలతోనూ రఫ్పాడించాడు. ప్రస్తుతం అతడు వరుస సినిమాలతో అలరిస్తున్నాడు.

Tollywood: అప్పుడు హోటల్లో సర్వెంట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్.. చివరకు తండ్రి కోసం..
Sunil Shetty
Rajitha Chanti
|

Updated on: May 04, 2025 | 8:44 AM

Share

ఆత్మవిశ్వాసం.. పట్టుదల ఉంటే ఎంతటి కఠినమైన పరిస్థితులను సైతం ఎదురించవచ్చు. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు నిరూపించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో.. తన తండ్రి పనిచేసిన హోటల్‏నే అతడికి బహుమతిగా అందించాడు. హిందీ సినిమా పరిశ్రమలో వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వెయిటర్‌గా పనిచేసిన భవనాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చిన ఈ స్టార్ హీరో ఎవరో కాదు.. బీటౌన్ స్టార్ సునీల్ శెట్టి.. తన తండ్రి వీరప్ప శెట్టి కోసం ఎవరూ ఊహించని పనిచేశాడు. దాదాపు 30 ఏళ్లుగా సినీరంగంలో 100కి పైగా చిత్రాల్లో నటించాడు సునీల్ శెట్టి. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలోనూ అదరగొట్టాడు. 1990లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు కూడా ఆయనే.

1992లో వచ్చిన బల్వాన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు సొంతంగా పాప్ కార్న్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ సైతం ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రంలో విలన్ పాత్రలో రఫ్పాడించాడు. ప్రస్తుతం సునీల్ శెట్టి వయసు 63 సంవత్సరాలు. ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటినిస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. తన తండ్రి చిన్నప్పుడే ముంబైకి పారిపోయారని.. 9 9 ఏళ్ల వయసులో దక్షిణ భారత రెస్టారెంట్‌లో టేబుల్ క్లీనర్‌గా పనిచేశాడని.. రాత్రిపూట బియ్యం సంచుల మధ్య నిద్రపోయేవారని చెప్పుకొచ్చారు.

తాను సైతం చిన్నప్పుడు తండ్రి పనిచేసిన హోటల్లో సర్వెంట్ గా పనిచేశానని.. హీరోగా ఎదిగిన తర్వాత తన తండ్రి పనిచేసిన మూడంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం సునీల్ శెట్టి ఆస్తులు రూ.125కోట్లు అని సమాచారం. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కథానాయికగా రాణించింది. ఆ తర్వాత భారత క్రికెటర్ కె.ఎల్ రాహుల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా