Vijay Sethupathi: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు.. అకౌంటెంట్ నుంచి జాతీయ అవార్డ్ వరకు..

| Edited By: Ravi Kiran

Jan 16, 2023 | 3:52 PM

రొమాంటిక్, విలన్, థ్రిల్లర్ మాస్టర్ లేదా యాక్షన్ నుంచి దాదాపు రెండు దశాబ్దాల తన సినీ కెరీర్ లో విజయ్ సేతుపతి తన నటనతో మెప్పించారు. సౌత్ టూ నార్త్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న హీరో విజయ్ సేతుపతి. ఈరోజు (జనవరి 16) మక్కల్ సెల్వన్ పుట్టిన రోజు.

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు.. అకౌంటెంట్ నుంచి జాతీయ అవార్డ్ వరకు..
Vijay Sethupati
Follow us on

ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు హీరో విజయ్ సేతుపతి. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో హీరోయిన్ తండ్రి రాయనం పాత్రలో కనిపించారు విజయ్. కూతురుపై అమితమైన ప్రేమున్న తండ్రిగా.. మరోవైపు పవర్‏ఫుల్ ‏గా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాలోనే ప్రతినాయకుడిగా కనిపించారు విజయ్. ఓవైపు హీరోగా నటిస్తూనే..మరోవైపు కంటెంట్..పాత్ర ప్రాధాన్యతను బట్టి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. రొమాంటిక్, విలన్, థ్రిల్లర్ మాస్టర్ లేదా యాక్షన్ నుంచి దాదాపు రెండు దశాబ్దాల తన సినీ కెరీర్ లో విజయ్ సేతుపతి తన నటనతో మెప్పించారు. సౌత్ టూ నార్త్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న హీరో విజయ్ సేతుపతి. ఈరోజు (జనవరి 16) మక్కల్ సెల్వన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా.

విజయ్ సేతుపతి.. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ నటన ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి ఎంతగానో కష్టపడ్డాడు. ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలోనే తనే ఓ స్టార్‍గా మారారు. పాఠశాల విద్యాభ్యాసం రోజుల్లో విజయ్ బ్యాగ్ బెంచర్. చదువు కంటే ఎక్కువ తనకు క్రీడర్.. ఇతర కార్యాకలాపాలపై ఆసక్తి ఉండేదట. నటుడిగా మారకముందు విజయ్ సేతుపతి అకౌంటెంట్ గా వర్క్ చేశాడు. ఆ తర్వాత మెల్లగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చిన వయసులోనే కుటుంబానికి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు అనేక ఉద్యోగాలు చేశారు. అందుకు ముందు అతను దుబాయ్ వెళ్లాడు. ఇక్కడ భారతదేశంలో సంపాదించిన జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా సంపాదించాడు.

ఇక దుబాయ్ లో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో జాసీనితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు సూర్య, కూతురు శ్రీజ ఉన్నారు. తన చిన్నప్పుడు ప్రాణ స్నేహితుడు మరణించిన తర్వాత అతని గుర్తుగా.. తన ఫ్రెండ్ పేరును తన కుమారుడికి పెట్టుకున్నారు విజయ్ సేతుపతి. తెన్మెర్కు పరువుకాట్రు సినిమాకు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు. అలాగే సూపర్ డీలక్స్ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. దీంతోపాటు.. సుందరపాండియన్ చిత్రానికి ఉత్తమ విలన్ గా తమిళనాడు రాష్ట్ర అవార్డ్ అందుకున్నాడు. ప్రతీ సినిమాలోనూ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోన్న విజయ్ సేతుపతిని.. తన ఫ్యాన్స్ ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటారు. ‘ధర్మదురై’ సినిమా సమయంలో వచ్చిన ఈ టైటిల్.. ఇప్పటికీ విజయ్ సేతుపతికి యాప్ట్ అని చెప్పాలి. ‘విక్రమ్ వేద’ సినిమాతో అటు తమిళంలోనే కాదు.. యావత్తు దేశమంతటా తనకు మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు విజయ్ సేతుపతి. కాగా, చిత్రాలలో నటించడమే కాకుండా..విజయ్ సేతుపతి పెన్, నమ్మ ఊరు హీరో, నవరసాలు, మచాన్ మచాన్, ఐంట్ నో సన్‌షైన్, స్పిరిట్ ఆఫ్ చెన్నై, మరిన్ని వంటి మ్యూజిక్ వీడియోలతో సహా పలు టీవీ షోలలో పాల్గొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.