Shah Rukh Khan Birth Day: ఇండియాలోనే నెంబర్ వన్.. షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే

షారుఖ్ ఖాన్ బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1988లో ప్రసారమైన 'ఫౌజీ' సీరియల్‌లో తొలిసారిగా నటించాడు. 1992లో విడుదలైన ‘దీవానా’ సినిమా ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ‘బాజీగర్‌’, ‘దుర్‌’, ‘డిడిఎల్‌జె’, ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘డాన్‌’, ‘డాన్‌ 2’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘పఠాన్‌’, జవాన్‌ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు షారుఖ్ కు క్రేజ్ తెచ్చిపెట్టాయి.

Shah Rukh Khan Birth Day: ఇండియాలోనే నెంబర్ వన్.. షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
Shahrukh Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2023 | 10:16 AM

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కి పుట్టినరోజు నేడు. కింగ్ ఖాన్ , కింగ్ ఆఫ్ బాలీవుడ్ లాంటి బిరుదులను సొంతం చేసుకున్నాడు షారుఖ్. తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగాడు ఈ బాద్షా.  బాలీవుడ్ సినిమాకే షారుఖ్ ఖాన్ గర్వకారణం అనే చెప్పాలినేడు షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో హీరోగా రాణిస్తున్నారు షారుఖ్. తన సినీ ప్రయాణంలో షారుఖ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు.

షారుఖ్ ఖాన్ బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1988లో ప్రసారమైన ‘ఫౌజీ’ సీరియల్‌లో తొలిసారిగా నటించాడు. 1992లో విడుదలైన ‘దీవానా’ సినిమా ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ‘బాజీగర్‌’, ‘దుర్‌’, ‘డిడిఎల్‌జె’, ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘డాన్‌’, ‘డాన్‌ 2’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘పఠాన్‌’, జవాన్‌ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు షారుఖ్ కు క్రేజ్ తెచ్చిపెట్టాయి. షారుఖ్ ఖాన్‌ ఆస్తుల విలువ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి.

షారుఖ్ ఖాన్ ఆస్తులు 6300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన హీరోలలో షారుఖ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన సంవత్సరానికి 280 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.  సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్ అలాగే అనేక వ్యాపార సంస్థల నుండి డబ్బు సంపాదిస్తున్నాడు ఈ స్టార్ హీరో. షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు 100-150 కోట్లు సంపాదిస్తున్నాడు. అంతే కాదు కొన్ని సినిమాల లాభాల్లో కూడా వీరికి వాటా ఉంటుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో షారుఖ్ ఒకరు. తమ సినిమాకు మంచి బిజినెస్ చేస్తుందని నిర్మాతలు కూడా అడిగినంత చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.

అలాగే షారుఖ్ ఖాన్ చాలా కంపెనీలకు అంబాసిడర్ గాను వ్యవహరిస్తున్నాడు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు దాదాపు పది కోట్ల వరకు అందుకుంటున్నాడు. అదే విధంగా షారూఖ్ ఖాన్ కు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఉంది.ఈ నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలు నిర్మిస్తున్నారు. దీని ద్వారా షారుక్ ఖాన్ ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. అలాగే షారుక్ ఖాన్ ఐపీఎల్ టీమ్ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ యజమాని. ఈ జట్టు విలువ 9,017 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఇక షారూఖ్ ఖాన్ దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. అతని వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. అతని కార్ కలెక్షన్ ధర 31 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది . అలాగే షారూఖ్‌కు విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ ఉంది. దీని ధర 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..