AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: వామ్మో.. నేషనల్ క్రేజ్ రేంజ్ మాములుగా లేదుగా.. రష్మిక బ్లాక్ డ్రెస్ ధర తెలిస్తే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ సినీరంగంలో కిరిక్ పార్టీ మూవీతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. భారీ బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Rashmika Mandanna: వామ్మో.. నేషనల్ క్రేజ్ రేంజ్ మాములుగా లేదుగా.. రష్మిక బ్లాక్ డ్రెస్ ధర తెలిస్తే..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: May 21, 2025 | 8:59 PM

Share

నేషల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక పేరు మారుమోగింది. దీంతో తెలుగుతోపాటు హిందీలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉండిపోయింది. ఇక ఈమధ్య కాలంలో రష్మిక నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. అతి తక్కువ సమయంలోనే 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. పుష్ప 2, యానిమల్, ఛావా వంటి పెద్ద ప్రాజెక్టులతో వరుసగా విజయాలు సాధించింది రష్మిక. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది రష్మిక. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫోటోషూట్ షేర్ చేసింది.

తాజాగా రష్మిక మందన్న బ్లాక్ కలర్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ కార్సెట్ తో క్రియేట్ చేసిన బ్లాక్ స్టన్నింగ్ మోడ్రన్ చీరలో మరింత అందంగా మెరిసింది. అయితే ఇప్పుడు రష్మిక క్రేజీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలాగే ఆ బ్లాక్ శారీ ధర సైతం నెట్టింట మారుమోగుతుంది. ఎందుకుంటే.. రష్మిక ధరించిన బ్లాక్ కలర్ శారీ ధర రూ.92,500. మీరు విన్నది నిజమే. సింపుల్ గా కనిపించినప్పటికీ ఈ శారీ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

బ్లాక్ శారీ ఫోటోస్ పంచుకుంటూ.. “కొంతకాలం తర్వాత నేను మళ్లీ రెడ్ కార్పెట్ పైకి వచ్చాను. నా హృదయంలో కురిపించిన ప్రేమ మరింత సంతోషాన్నిచ్చింది. ఈరోజు నేను ఏమి ధరించానో మీకు చూపించాలనుకుంటున్నాను. కఠినమైన, బిజీగా ఉన్న రోజులను తట్టుకుని నేను నిలబడటానికి కారణం నా కుటుంబమే. మీలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ” అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం రష్మిక ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహిస్తున్న థామా చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. అలాగే కుబేర, పుష్ప 3, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

Follow Us
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి
రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనక రహస్యం
విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనక రహస్యం
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న..భగవద్గీతలోనే వివాహ శుభలేఖ!
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న..భగవద్గీతలోనే వివాహ శుభలేఖ!
మీ PF క్లెయిమ్‌ రిజెక్ట్‌ కావొద్దంటే ఇలా చేయండి!
మీ PF క్లెయిమ్‌ రిజెక్ట్‌ కావొద్దంటే ఇలా చేయండి!
శిఖర్ ధావన్, మహానార్యమన్ సింధియా సమక్షంలో ఎంపీఎల్ ఉమెన్ డ్రాఫ్ట్!
శిఖర్ ధావన్, మహానార్యమన్ సింధియా సమక్షంలో ఎంపీఎల్ ఉమెన్ డ్రాఫ్ట్!
అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు..
అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు..