Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘స్వాతిముత్యం’లో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియా ఫేమస్! ఎవరో గుర్తుపట్టారా?

అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ ట్యాగ్‌కు సరైన యాప్ట్ ఈ హీరో. డ్యాన్స్, యాక్టింగ్‌లో తనదైన స్టైల్‌ను చూపిస్తూ..

Tollywood: 'స్వాతిముత్యం'లో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియా ఫేమస్! ఎవరో గుర్తుపట్టారా?
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 08, 2023 | 10:20 AM

అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ ట్యాగ్‌కు సరైన యాప్ట్ ఈ హీరో. డ్యాన్స్, యాక్టింగ్‌లో తనదైన స్టైల్‌ను చూపిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులకు దగ్గరయ్యారు అల్లు అర్జున్. బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలతో టాలీవుడ్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌తో ‘పుష్ప -2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి శుక్రవారం రిలీజైన కాన్సెప్ట్ టీజర్ యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ బాలనటుడిగా టాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఆయన బాలనటుడిగా నటించిన రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాల్లో ఒకటి చిరంజీవి హీరోగా వచ్చిన ‘విజేత’ కాగా.. మరొకటి కమల్ హాసన్ ‘స్వాతిముత్యం’. అలాగే అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు.. చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమాలో ఓ క్యామియో రోల్ చేశారు.

‘గంగోత్రి’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన అల్లు అర్జున్.. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ‘దేశముదురు’, ‘పరుగు’, ‘వేదం’, ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసు గుర్రం’, ‘S/O సత్యమూర్తి’, ‘డీజే’, ‘అల వైకుంఠపురం’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కాగా, ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ‘పుష్ప – ది రూల్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.