Jr.NTR: బాల రామాయణం కాకుండా ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?..

|

Nov 27, 2022 | 6:40 PM

1997లో దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాల రామాయణం సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ కంటే ముందే తారక్ మరో సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారని చాలా మందికి తెలియదు. పదేళ్ల వయసులోనే బిగ్ స్క్రీన్ పై కనిపించారు ఎన్టీఆర్.

Jr.NTR: బాల రామాయణం కాకుండా ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?..
Ntr
Follow us on

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తారక రామారావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తారక్.. నటనలో నీకు లేదు సాటి అనేట్లుగా చిత్రపరిశ్రమలో తనకంటూ పత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. యాక్షన్ సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టిన ఎన్టీఆర్.. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సింగిల్ టేక్ ‏లో భారీ సంభాషణలు చెప్పడమే కాదు.. అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే హీరో కూడా. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం తారక్‏ది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా వెండితెరపై సందడి చేసిన యంగ్ టైగర్.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు. నటుడిగానే కాదు.. గాయకుడిగానూ అలరించారు. యమదొంగ, కంత్రి, అదుర్స్, నాన్నకు ప్రేమతో, రభస సినిమాల్లో గాయకుడిగానూ తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‏గా దూసుకుపోతున్న తారక్... బాలనటుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.

1997లో దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాల రామాయణం సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఆ సినిమాలో బాలరాముడిగా తారక్ ను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తారక్ అల్లరి మాములుగా ఉండేది కాదట. సెట్‏తో తోటి పిల్లలతో కలిసి ఎన్టీఆర్ తెగ అల్లరి చేసేవారట. అయితే ఈ మూవీ కంటే ముందే తారక్ మరో సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారని చాలా మందికి తెలియదు. పదేళ్ల వయసులోనే బిగ్ స్క్రీన్ పై కనిపించారు ఎన్టీఆర్. అదే బ్రహ్మర్షి విశ్వామిత్ర.

ఇవి కూడా చదవండి

1991లో తెరకెక్కిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే తాతను పోలిన రూపంలో కనిపించడంతో అంతా జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారట. ఈ సినిమాను నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించి.. ఆయన సొంత నిర్మాణ సంస్థ ఎన్ఏటీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. పురాణాల్లోని విశ్వామిత్రుని కథను ఆధారంగా చేసుకుని సమకాలీన సాంఘిక, రాజకీయ అంశాలపై విమర్శనాస్త్రంగా రామారావు సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో తారక్ బాలనటుడిగా కనిపించారు. సినిమాకు సంగీతదర్శకత్వం ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ అందించారు. ఆయన సంగీతం అందించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.