టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది విలన్స్ గా నటించి మెప్పించారు. కొంతమంది హీరోలు విలన్స్ గానూ తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో నటుడు బాబీ సింహ ఒకరు. హైదరాబాద్‌లోని మౌలాలీలో పుట్టి పెరిగిన బాబీ సింహ తమిళ్‌లో నటుడిగా రాణించాడు. సిద్ధార్థ్ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాతో తెలుగులో తొలిసారి పరిచయం అయ్యాడు బాబీ సింహ. ఆతర్వాత ఎక్కువగా తమిళ్ లోనే నటించాడు. తమిళ్ లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు ఈ వర్సటైల్ యాక్టర్. ఇక ఆయన నటించిన జిగర్తాండా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే సినిమాను తెలుగులో గద్దల కొండ గణేష్ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ వరుణ్ తేజ్ పోషించిన పాత్రను అక్కడ బాబీ సింహ చేశారు. ఆతర్వాత బాబీ సింహ క్రేజ్ పెరిగిపోయింది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ నటించాడు.
తెలుగులో రన్, ఏదైనా జరగొచ్చు, డిస్కో రాజా,అమ్ము, గల్లీ రౌడీ, సినిమాలు చేశాడు. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ నటించి మెప్పించాడు. ఈ సినిమాతో బాబీ సింహకు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులోనూ ఈ విలన్ పేరు పాపులర్ అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమా తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ లోనూ నటించాడు. ఈ సినిమాలో బాబీ కీలక పాత్రలో మెరిశాడు.
ఇదిలా ఉంటే బాబీ సింహ భార్య తెలుగులో హీరోయిన్ గా నటించింది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బాబీ సింహ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. బాబీ సింహ సతీమణి పేరు రెష్మీ మీనన్. ఆమె తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. రేష్మీ 2002లో బాలనటిగా, 2010లో తమిళ సినిమా ‘ఇనిధు ఇనిధు’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన నేనోరకం సినిమాలో హీరోయిన్ గా చేశారు.అలాగే 2018లో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన హైదరాబాద్ లవ్ స్టోరి సినిమాలోనూ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలితోనే గడిపేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.