Tollywood : ఏంటీ.. ఈ నటుడి కూతురు ఆ క్రేజీ హీరోయినా.. ? నెట్టింట ఫోటోస్ చూస్తే..

తమిళ చిత్రపరిశ్రమలో అతడు తోపు యాక్టర్. దశాబ్దాలకాలంగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గానూ పనిచేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ హీరోస్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. అతడే లివింగ్‏స్టన్. తాజాగా ఈ నటుడి కూతురు సినిమాల్లోకి అడుగుపెడుతుంది. కానీ అప్పటికే బుల్లితెరపై ఆమె క్రేజీ హీరోయిన్.

Tollywood : ఏంటీ.. ఈ నటుడి కూతురు ఆ క్రేజీ హీరోయినా.. ? నెట్టింట ఫోటోస్ చూస్తే..
Actor

Updated on: May 01, 2025 | 1:03 PM

తమిళ చిత్రపరిశ్రమలో లివింగ్‏స్టన్ ఫేమస్ యాక్టర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి నటుడిగా తనదైన ముద్రవేశారు. అలాగే ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్ గా పనిచేశారు. 1988 లో విడుదలైన పూంతోట కవల్కరన్ చిత్రంతో ఆయన తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అనేక చిత్రాల్లో కనిపించారు. అతను మొదట సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రల్లో నటించడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. లివింగ్‏స్టన్ కుమార్తెలు సైతం ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

లివింగ్‏స్టన్ పెద్ద కూతురు జోవికా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇప్పటికే ఆమె బుల్లితెరపై క్రేజీ హీరోయిన్. టీవీల్లో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె మొదట సన్ టీవీలో ప్రసారమై ముగిసిన పూవే ఉనకక్క సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత అరువి సీరియల్‌లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడిప్పుడే జోవికా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జోవిక చాలా యాక్టివ్. ఇప్పటివరకు ఆమె షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తమిళంతోపాటు తెలుగులోనూ నటించేందుకు జోవిక రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం త్వరలోనే సినిమాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె కస్తూరి నివాస అనే సీరియల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..