Shah Rukh Khan: షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతులు ?.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ ఎనిమిదో సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, అలియా భట్, కరీనా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, కాజోల్, రాణి ముఖర్జీ అతిథులుగా హాజరయ్యారు. ఇటీవల, నటుడు అజయ్ దేవగన్, నిర్మాత-దర్శకుడు రోహిత్ శెట్టి ఈ షోలో పాల్గొన్నారు. వీరిద్దరూ సింగం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో సందడి చేశారు. ఈ క్రమంలో కరణ్ అడిగిన ప్రశ్నకు అజయ్ సూటిగా సమాధానమిచ్చాడు.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతులు ?.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Salman Khan, Shah Rukh Khan

Updated on: Dec 24, 2023 | 9:50 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీరిద్దరికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సూపర్ హిటి చిత్రాల్లో నటించి తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. తమ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వీరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఇద్దరూ వేల కోట్లకు రారాజులు. కానీ ఇద్దరిలో ఎవరు అత్యధిక ధనవంతుడు అనేది విషయం తెలుసా ?. ఇద్దరూ ఎక్కువ సంపాదన కలిగి ఉన్నారు. ఇప్పటికీ ఇద్దరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. షారుఖ్, సల్మాన్ ఇద్దరి సినిమాలు కమర్షియల్ హిట్స్ అవుతాయి. కానీ ఇద్దరిలో ఎక్కువ ధనవంతుడు ఎవరనేది ఎవరికీ అర్థం కానీ విషయం. తాజాగా ఈ ప్రశ్నపై హీరో అజయ్ దేవగన్ స్పందించారు.

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ ఎనిమిదో సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, అలియా భట్, కరీనా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, కాజోల్, రాణి ముఖర్జీ అతిథులుగా హాజరయ్యారు. ఇటీవల, నటుడు అజయ్ దేవగన్, నిర్మాత-దర్శకుడు రోహిత్ శెట్టి ఈ షోలో పాల్గొన్నారు. వీరిద్దరూ సింగం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో సందడి చేశారు. ఈ క్రమంలో కరణ్ అడిగిన ప్రశ్నకు అజయ్ సూటిగా సమాధానమిచ్చాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను ఎవరు ఎక్కువ ధనవంతులు కరణ్ అజయ్ దేవగన్‌ని అడిగారు. ఈ ప్రశ్నకు అజయ్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కిస్తే షారుఖ్ ఖాన్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. అందుకే అతనిపై నాకు నమ్మకం ఎక్కువ’ అన్నాడు అజయ్. ఈ ఏడాది షారుఖ్ మూడు సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. దీంతో అజయ్ దేవగన్ సమాధానం నిజమే అని అన్నారు కరణ్.

షారుఖ్ ఖాన్ ఆస్తి వివరాలు..

దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో షారుఖ్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ.6,300 కోట్లు. నటుడిగానే కాకుండా గ్లోబల్ బ్రాండ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తన ప్రొడక్షన్ వెంచర్‌ల నుంచి వెండితెరపై హీరో వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు షారుఖ్. నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ ‘పఠాన్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఆ తర్వాత విడుదలైన ‘జవాన్‌’ కూడా రూ.1100 కోట్లు రాబట్టింది.

సల్మాన్ ఆస్తి వివరాలు..

సల్మాన్ ను తన అభిమానులు భాయిజాన్ అని పిలుచుుకుంటారు. వెండితెరపై హీరోగానే కాకుండా వ్యాపారం, టెలివిజన్ పై కూడా సంపాదిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, సల్మాన్ నికర విలువ రూ.2000 కోట్లకు ఎక్కువే ఉంటుంది. పోర్ట్‌ఫోలియో, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు , దుస్తుల వ్యాపారం వరకు ఎన్నో విధాలుగా సంపాదిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.