Director Rajamouli: కెరీర్ ప్రారంభంలో రాజమౌళికి డబ్బులిచ్చి అండగా నిలిచిన స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అపజయం ఎరుగని అతి కొద్ది మంది డైరెక్టర్లలో ది గ్రేట్ రాజమౌళి ఒకరు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్ కు టాలీవుడ్ ను తీసుకెళ్లాడు. ఇప్పుడు వారణాసి సినిమాతో మరో వండర్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడీ దర్శక ధీరుడు.

Director Rajamouli: కెరీర్ ప్రారంభంలో రాజమౌళికి డబ్బులిచ్చి అండగా నిలిచిన స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా?
SS Rajamouli

Updated on: Mar 07, 2026 | 7:28 PM

సినిమా ఇండస్ట్రీలో ఎస్.ఎస్. రాజమౌళి క్రేజ్, గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పరిశ్రమంలో ఒక్క హిట్ కొట్టడమే గొప్ప అనుకుంటే ఏకంగా వరుసగా 12 సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు రాజమౌళి. సమకాలీన దర్శకుల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అపజయమెరుగని దర్శకుడిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగిపోయాడు రాజమౌళి. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇలా 100 పర్సెంట్ సక్సెస్ రేట్ తో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నాడు రాజమౌళి. అయితే కెరీర్ ప్రారంభంలో ఆయన కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. దర్శక కేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేటప్పుడు రాజమౌళికి చాలా అవసరాలు ఉండేవట. ఎవరిని డబ్బులు అడగాలో తెలియక సతమతమయ్యే వాడట. అలాంటి సందర్భంలో రాజమౌళి పరిస్థితిని అర్థం చేసుకున్న రాఘవేంద్రరావు పిలిచి మరీ అతనికి డబ్బులు ఇచ్చేవారట. ఈ కారణంగానే ఇప్పటికీ రాజమౌళి రాఘవేంద్రరావు గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. ఇక తన మొదటి సినిమా అయిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాకి సైతం రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం చాలావరకు హెల్ప్ అయిందట.మొత్తానికైతే రాజమౌళి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తన గురువు రాఘవేంద్రరావును తరచూ గుర్తు చేసుకుంటుంటాడు.

ఇవి కూడా చదవండి

మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ ఈవెంట్ లో దర్శక కేంద్రుడు రాఘవేంద్రరావు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us