Animal Movie: ‘యానిమల్ ‘ సినిమాలో జోయా పాత్రకు ఆ హీరోయిన్ అడిషన్.. త్రిప్తి కంటే ముందే రిజెక్ట్ అయిన బ్యూటీ..

|

Dec 08, 2023 | 5:53 PM

ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించి రష్మిక కంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది త్రిప్తి. ఈ సినిమాలో 'జోయా రియాజ్' పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలోని ట్రిప్తీ పాత్రకు సంబంధించిన వీడియోస్ నెట్టింట షేర్ అవుతున్నాయి. యానిమల్ చిత్రంలో విలన్ (అబ్రార్) గా నటించిన బాబీ డియోల్ భార్య జోయా రియాజ్ పాత్రను పోషించింది. అయితే హీరో అర్జున్ సింగ్ (రణబీర్ కపూర్) .. కుటుంబం గురించి సమాచారాన్ని పొందడానికి అబ్రార్ ఆమెను హనీ ట్రాప్‌గా ఉపయోగించుకున్నాడు.

Animal Movie: యానిమల్  సినిమాలో జోయా పాత్రకు ఆ హీరోయిన్ అడిషన్.. త్రిప్తి కంటే ముందే రిజెక్ట్ అయిన బ్యూటీ..
Animal Movie
Follow us on

గత ఐదారు రోజులుగా త్రిప్తి డిమ్రి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. మొన్నటి వరకు ప్రేక్షకులకు అసలు పరిచయమే లేని ఈ బ్యూటీ.. ఇప్పుడు ఒక్కసారిగా నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న ‘యానిమల్’ సినిమానే. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించి రష్మిక కంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది త్రిప్తి. ఈ సినిమాలో ‘జోయా రియాజ్’ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలోని ట్రిప్తీ పాత్రకు సంబంధించిన వీడియోస్ నెట్టింట షేర్ అవుతున్నాయి. యానిమల్ చిత్రంలో విలన్ (అబ్రార్) గా నటించిన బాబీ డియోల్ భార్య జోయా రియాజ్ పాత్రను పోషించింది. అయితే హీరో అర్జున్ సింగ్ (రణబీర్ కపూర్) .. కుటుంబం గురించి సమాచారాన్ని పొందడానికి అబ్రార్ ఆమెను హనీ ట్రాప్‌గా ఉపయోగించుకున్నాడు. ఈ చిత్రంలో జోయా రియాజ్ పాత్రను పోషించి ఆమె నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పాత్ర కోసం త్రిప్తి కంటే ముందు చాలా మంది బాలీవుడ్ తారలు ఆడిషన్‌లో విఫలమయ్యారని చాలా మందికి తెలియదు. అవును..నిజమే.

వాస్తవానికి ఈ చిత్రంలో ‘జోయా రియాజ్’ పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా మొదటి ఎంపిక త్రిప్తి డిమ్రీ కాదని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం చాలా మంది నటీనటులు ఆడిషన్ చేశారట. అందులో తన నటనా నైపుణ్యంతో మెప్పించిన తర్వాత మాత్రమే త్రిప్తిని ఎంపిక చేశారని సమాచారం. అయితే ఇంతకీ జోయా పాత్రకు అడిషన్ ఇచ్చినవారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారని తెలుసా.. తనే హీరోయిన్ సారా అలీ ఖాన్. ఈ చిత్రంలో జోయా పాత్రను పోషించేందుకు సారా అలీ ఖాన్ సైతం ఆడిషన్ ఇచ్చింది. కానీ ఈ పాత్రలో బోల్డ్, గ్లామర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో..సారాను రిజెక్ట్ చేశారట డైరెక్టర్ సందీప్. ఈ సినిమాలో జోయా రియాజ్ పాత్రను పోషించడానికి సారా సరైన ఎంపిక కాదని సందీప్ భావించాడని, అందుకే సారాను తీసుకోలేదని ఇప్పుడు బీటౌన్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టిస్తోంది. మరోవైపు సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టా్ర్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.