Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..

సినీరంగంలో కొన్నిసార్లు ఓ స్టార్ హీరోలను ఊహించుకుని కథలను సిద్ధం చేసుకుంటారు డైరెక్టర్స్. కానీ అనుహ్యంగా ఆ ప్రాజెక్టులో మరో హీరో నటించాల్సి వస్తుంది. అయినప్పటికీ అందులో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాగా. మరికొన్ని మాత్రం నిరాశపరుస్తుంటాయి. ప్రభాస్ చేయాల్సిన సినిమాను తారక్ చేశారు. అదేంటంటే..

Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..
Prabhas, Jrntr
Follow us

|

Updated on: Oct 30, 2024 | 4:54 PM

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత తారక్ నటించబోయే సినిమాపై మరింత హైప్ నెలకొంది. దేవర తర్వాత తారక్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడని.. ఈరోల్ నెగిటివ్ షెడ్స్ లో ఉంటుందని టాక్ నడుస్తుంది. కొద్దిరోజులుగా వేగంగా జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు తారక్. అలాగే దేవర 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ లో ఓ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ గత చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరలవుతుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయాల్సిన ఈ మూవీని ఎన్టీఆర్ తో తెరకెక్కించారట. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఏ సినిమా ? అసలు స్టోరీ ఏంటీ ? అనేది తెలుసుకోవాలని ఉందా.. ? అయితే పూర్తి కథనం చదవాల్సిందే. తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమాతో స్టైలిష్ దర్శకుడిగా మచి పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన కొన్నిసార్లు ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. అయితే తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డికి అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో భాగంగానే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తిక కామెంట్స్ చేశారు.

తన రెండో సినిమా ప్రభాస్ తో చేయాలనుకున్నారట. కానీ కుదరలేదని అన్నారు. అతనొక్కడే సినిమా విజయం తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని.. కానీ అప్పటికే ప్రభాస్ తో సినిమా చేయాలని అన్నీ సిద్దం చేసుకున్నాని.. కానీ అప్పుడే తారక్ తో ఓ సినిమా చేయాలని ఓ వ్యక్తి కోరడంతో ఆయన మాట కాదనలేక సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అన్నారు. ఎన్టీఆర్ ను కలిసిన తర్వాత ఆయన ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారని.. అదే అశోక్ మూవీ అని అన్నారు. ఈ మూవీ ప్రభాస్ తో తీద్దామనుకున్న కథ కాదని.. అప్పటికే స్టోరీ రెడీగా ఉండడంతో చిన్న చిన్న మార్పులు చేసి తెరకెక్కించినట్లు గుర్తుచేసుకున్నారు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ గింజల్ని రెగ్యులర్‌గా తింటే ఇలాంటి భయంకరమైన సమస్యలు పరార్..!
ఈ గింజల్ని రెగ్యులర్‌గా తింటే ఇలాంటి భయంకరమైన సమస్యలు పరార్..!
Pro Kabaddi: 5 ఏళ్ల కరువుకు చెక్ పెట్టేసిన బెంగాల్ వారియర్స్..
Pro Kabaddi: 5 ఏళ్ల కరువుకు చెక్ పెట్టేసిన బెంగాల్ వారియర్స్..
17 ఏళ్లకే ఎన్నో విమర్శలు.. కట్ చేస్తే.. వందల కోట్లకు మహారాణి..
17 ఏళ్లకే ఎన్నో విమర్శలు.. కట్ చేస్తే.. వందల కోట్లకు మహారాణి..
బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తున్నారా..?ఇలా జుట్టుకు వాడి చూడండి
బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తున్నారా..?ఇలా జుట్టుకు వాడి చూడండి
త్యం అలసటగా ఉంటున్నారా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
త్యం అలసటగా ఉంటున్నారా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
యూపీ సీఎం యోగిని చంపేస్తామని యువతి ఫోన్ కాల్!
యూపీ సీఎం యోగిని చంపేస్తామని యువతి ఫోన్ కాల్!
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా?
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా?
సరదా చావుకొచ్చింది..! ఫన్‌రైడ్‌ కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకుంది.
సరదా చావుకొచ్చింది..! ఫన్‌రైడ్‌ కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకుంది.
ఒకప్పుడు నటుడిగా ఆ సినిమాలకు ఆడిషన్స్.. ఇప్పుడు..
ఒకప్పుడు నటుడిగా ఆ సినిమాలకు ఆడిషన్స్.. ఇప్పుడు..
చెత్త జాబితాలో చేరిన రోహిత్ శర్మ.. కెరీర్‌లోనే అతి పెద్ద కళంకం
చెత్త జాబితాలో చేరిన రోహిత్ శర్మ.. కెరీర్‌లోనే అతి పెద్ద కళంకం
దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్.
దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్.
మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు..
మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు..
ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..
ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..
మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..
మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..
అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..
అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..
తెల్లగా ఉన్న ఈ 5 పక్కన పెట్టేస్తే.. 100 ఏళ్ల లైఫ్ గ్యారంటీ.!
తెల్లగా ఉన్న ఈ 5 పక్కన పెట్టేస్తే.. 100 ఏళ్ల లైఫ్ గ్యారంటీ.!
దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా.?
దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా.?
శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! |గోపీచంద్‌ చొక్కానే ప్రభాస్‌..
శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! |గోపీచంద్‌ చొక్కానే ప్రభాస్‌..
గ్యాంబ్లర్ వచ్చేశాడు.. అదరగొట్టేస్తున్నాడు.! నేచర్ బాలన్స్ వరుణ్.
గ్యాంబ్లర్ వచ్చేశాడు.. అదరగొట్టేస్తున్నాడు.! నేచర్ బాలన్స్ వరుణ్.
స్టార్ హీరో రేసింగ్‌ వెబ్‌ సైట్‌ అసలు విషయం.తెలిసి ఫీలైన ఫ్యాన్స్
స్టార్ హీరో రేసింగ్‌ వెబ్‌ సైట్‌ అసలు విషయం.తెలిసి ఫీలైన ఫ్యాన్స్