
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది హీరోయిన్ పూజా హెగ్డే. ఒక లైలా కోసం అంటూ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాందించుకుంది. అయితే బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ ఫాంలో ఉన్న పూజాకు వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో పడ్డాయి. గతేడాది ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అయినప్పటికీ పూజాకు మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. కానీ కొన్ని కారణాలతో సినిమాల నుంచి తప్పుకుంటుంది ఈ బ్యూటీ.ఇప్పటికే మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది పూజా. దీంతో ఆమె స్థానంలోకి కొత్త కథానాయిక మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. దీనిపై ఇప్పటివరకు చిత్రయూనిట్ గానీ.. పూజా గానీ స్పందించలేదు. ఇటీవలే రవితేజ కొత్త ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియలేదు. అయితే ఓవైపు సినిమాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది పూజా.
ఇక ఇప్పుడు పూజా చేతిలో అంతగా సినిమాలు లేవు. దీంతో ఇప్పుడీ బ్యూటీ పలు షాపింగ్ మాల్స్ ప్రారంభ కార్యక్రమాలకు హజరవుతుంది. శుక్రవారం కడపలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది పూజా. ఈ సందర్భంగా బుట్టబొమ్మను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం పూజాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లాబెట్టాల్సిందే.
అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉన్నందుకు ఆమెకు ఏకంగా రూ.40 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేవలం కడప మాత్రమే కాదు.. ఎక్కడైనా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలంటే దాదాపు రూ. 40 లక్షలు తీసుకుంటుందని సమాచారం. దీంతో సినిమాలు తగ్గినప్పటికీ ట్రెండింగ్ లో మాత్రం బుట్టబొమ్మదే హవా.
పూజా హెగ్డే చివరి సారిగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. దీంతో పూజా గ్రాఫ్ సైతం పడిపోయింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ సరసన ఆమె నటించిన కిసీ కా బాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు పూజా వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.