
సినిమా రంగం అంటే రంగులతో కూడిన ప్రపంచం. ఈ ప్రపంచంలో అడుగు పెట్టాలని.. రాణించాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో నటించి రాణిస్తున్నారు. మరికొంతమంది అలా వచ్చి ఇలా మాయం అవుతూ ఉంటారు. కొంతమంది మనం ఊహించని వారు కూడా సినిమాల్లో కనిపించి షాక్ ఇస్తూ ఉంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా..? అస్సలు సినిమాలకు సంబంధం లేని వ్యక్తి అతను. కానీ ఇలా సినిమాలో మెరిశాడు. తానుకు సినిమాలతో ఎలాంటి సంబంధం లేదు అని తెలిపే వ్యక్తి ఆయన. రాజకీయ పరంగా మాత్రం ఎలాంటి విషయం గురించైనా ఇట్టే చెప్పే వ్యక్తి ఆయన. ఇంతకు ఆయన ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో దివంగత కమెడియన్ వేణుమాధవ్ తో ఉన్న వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న. తీన్ మార్ మల్లన్న వార్తలతో బాగా పాపులర్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఓ సొంత ఛానెల్ తో రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటారు. తీన్ మార్ మల్లన్న ఇలా సినిమాలో నటించి మెప్పించారు. ఆ సినిమా పేరు శ్రీమతి బంగారం. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వేణుమాధవ్ తో కలిసి కొన్ని సన్నివేశాల్లో కనిపించారు మల్లన్న.
వేణుమాధవ్ తనకు మంచి మిత్రుడు కావడంతో ఒక రోజు షూటింగ్ చూడటానికి వెళ్లారట మల్లన్న. అదే సమయంలో తన స్నేహితుడి కోరిక మేరకు ఓ చిన్న సన్నివేశంలో నటించారట. అలాగే త్రిష హీరోయిన్ గా నటించిన ఓ సినిమాలోనూ కనిపించాను అని గతంలో ఓ వేదిక పై చెప్పారు మల్లన్న. ఇప్పుడు మల్లన్న నటించిన సినిమాలోని నన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
వేణుమాధవ్ పక్కన ఉన్న యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా 😂 pic.twitter.com/YFQ5L25FjA
— Vamshi (@vamsi_144) January 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.