Raghav Chadda: ఒక్క పనితో ఎగిరిపోయిన 18 లక్షల ఫాలోవర్స్.. రాఘవ్ చద్దా భార్య తోపు హీరోయిన్ అని తెలుసా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పొలిటిషియన్ ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాఘవ్ చద్దా. గత రెండు రోజులుగా ఆయన నెట్టింట సెన్సేషన్. మొన్నటి వరకు అతడు పార్లమెంట్ లో మాట్లాడే ప్రతి మాటకు యూత్ ఫిదా అయ్యారు. కానీ ఇప్పుడు అతడు చేసిన ఒక్క పనితో దెబ్బకు ఫాలోవర్స్ షాకిచ్చారు. గంటలో ఏకంగా 18 లక్షల మంది అన్ ఫాలో కొట్టేశారు.

Raghav Chadda: ఒక్క పనితో ఎగిరిపోయిన 18 లక్షల ఫాలోవర్స్.. రాఘవ్ చద్దా భార్య తోపు హీరోయిన్ అని తెలుసా.. ?
Raghav Chadha

Updated on: Apr 26, 2026 | 4:36 PM

రాఘవ్ చద్దా.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఇందుకు కారణం ఆయన పార్టీ మారడమే. మొన్నటివరకు ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ. అతడు పార్లమెంట్ లో మాట్లాడే ప్రతి మాటకు యూత్ ఫిదా అయ్యేవారు. ఆయనతరంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు. ముఖ్యంగా గిగ్ వర్కర్ల ఇబ్బందులు, ఎయిర్‌పోర్టుల్లో తినుబండారాల అధిక ధరలు, యువతకు సంబంధించిన అంశాలపై ఆయన గొంతు వినిపించేవారు. ఒకరోజు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన స్టైలిష్ లుక్, చురుకైన మాటతీరు యువతను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ పార్టీలో చేరారు. దీంతో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ తగ్గిపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

చద్దా పార్టీ మారిన వెంటనే సోషల్ మీడియాలో ‘అన్‌ఫాలో రాఘవ్ చద్దా’ (#UnfollowRaghavChadha) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. శుక్రవారం నాటికి 14.6 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న ఆయన ఖాతా, శనివారం మధ్యాహ్నం కల్లా 13.5 మిలియన్లకు పడిపోయింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాఘవ్ చద్దా గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అతడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాఘవ్ చద్దా భార్య ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ అని మీకు తెలుసా.. ? అవును. నటిగా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

రాఘవ్ చద్దా భార్య పరిణీతి చోప్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. రాఘవ్ చద్దా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తుంటే, ఆయన భార్య పరిణీతి చోప్రా గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి అయిన పరిణీతి, ‘లేడీస్ వర్సెస్ రికీ బాల్’ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. ‘ఇషాక్జాదే’ సినిమాతో ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు (స్పెషల్ మెన్షన్) లభించింది. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీ తో ఫసీ’ వంటి సినిమాలతో ఆమె యూత్ ఐకాన్‌గా మారారు. నటిగానే కాకుండా, ఆమె అద్భుతమైన గాయని కూడా. వీరిద్దరు మంచి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారింది. 2023లో ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు జన్మించాడు. ప్రస్తుతం పరిణితి సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

పరిణితి చోప్రా ఇన్ స్టా.. 

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

Follow Us