ఈ లేడీ కమెడియన్ గుర్తుందా.? పాపం ఎలా చనిపోయారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది లేడీ కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవిడే జ్యోతి. టాలీవుడ్ హాస్యనటి బండ జ్యోతి జీవిత ప్రస్థానం విజయవాడ నుండి హైదరాబాద్ వరకు సాగింది. తన భారీ ఆకారంతోనే అవకాశాలు పొంది ప్రేక్షకులను నవ్వించారు.

ఈ లేడీ కమెడియన్ గుర్తుందా.? పాపం ఎలా చనిపోయారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Actress

Updated on: May 20, 2026 | 11:22 AM

బండ జ్యోతి, టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఒక సుపరిచితమైన హాస్య నటి ఆమె, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , కమెడియన్ గా ఎన్నోసినిమాల్లో నటించి నవ్వులుపూయించారు ఆమె. జ్యోతి పేరు వినగానే ఆమె భారీ ఆకారమే మనకు వెంటనే గుర్తుకు వస్తుంది. విజయవాడలో జ్యోతి పట్నాయక్‌గా పుట్టి, బ్రతుకుతెరువు కోసం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చారు ఆమె. ఇక్కడే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి, ఈవీవీ సత్యనారాయణ గారి దృష్టిలో పడటంతో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇది ఆమె సినీ ప్రస్థానానికి నాంది పలికింది. జ్యోతి వ్యక్తిగత జీవితంలో చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. ఆమె భారీ దేహం వలనే ఆమె వయసు ఎక్కువగా కనిపించడంతో చిన్న వయసులోనే పెళ్లి చేయాల్సి వచ్చిందని అంటారు. భర్తకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా సహాయపడటానికి ఆమె సినిమాల్లోకి వచ్చారు. అయితే, ఆమె ఆకారం అవకాశాలు తెచ్చినట్లే, కొన్నిసార్లు ఆమెకు లభించే పాత్రలను పరిమితం చేసింది. ఫిట్‌నెస్‌కు తగ్గ పాత్రలనే దర్శకులు ఆమెకు అందించేవారు, దీంతో ఆమె ఆశించినంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్‌గా మారలేకపోయారు. అయినప్పటికీ, తనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రేక్షకులను అలరించారు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

జ్యోతి స్నేహపూర్వక స్వభావం, బోళాతనంతో కూడిన మాటతీరు, సెట్‌లో జోకులు వేయడం, తనపై జోకులు వేయించుకోవడం ఆమెకు అలవాటు. తన చుట్టూ జూనియర్ ఆర్టిస్టులను ఉంచుకుని అందరితో కలివిడిగా ఉండే ఆమె స్వచ్ఛమైన మనసును చాలామంది గుర్తుచేసుకుంటారు. ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా, ధనవంతుల కుటుంబం కాకపోయినా, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని 20 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకున్నారట జ్యోతి. ఆమెకు రియల్ స్టార్ శ్రీహరి గారు అంటే చాలా ఇష్టం, ఆయనతో విజయ రామరాజు, భద్రాచలం, శేషాద్రి నాయుడు వంటి పలు చిత్రాలలో నటించారు. దర్శకుల్లో ఈవీవీ సత్యనారాయణ గారు తనకి లైఫ్ ఇచ్చారని తరచుగా గుర్తుచేసుకునేవారట. రాజేంద్ర ప్రసాద్‌తో “అందగాడు”, ఏవీఎస్‌తో కలిసి పలు చిత్రాలలో నటించారు. ఈవీవీ సత్యనారాయణ గారి చిత్రాలతో పాటు, గణేష్, తోకలేని పిట్ట, స్వయంవరం, కళ్యాణ రాముడు, ఫోటో వంటి చిత్రాలలో ఆమె నటన కొద్దిపాటి పాత్రలైనా తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

జ్యోతికి ఒక కుమారుడు ఉన్నారు, అతనికి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో ఆమెకు ఇద్దరు మనవలు ఉన్నారు. తీరిక సమయాల్లో కొడుకు ఇంటికి వెళ్లి పిల్లలతో గడపడం ఆమెకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో, ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, టీవీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. ఆమె నటించిన “అమ్మ నా కోడలా” సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, ప్రధాన పాత్రల్లో వచ్చే కథలు దొరక్కపోవడం ఆమెను నిరాశపడ్డారట. బరువు తగ్గడానికి ఆహారం తగ్గించుకున్నప్పటికీ ఫలితం లేకపోగా, నీరసం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చివరి రోజుల్లో ఆమెకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు కొంత కోలుకున్నా, రెండవసారి గుండెపోటు వచ్చినప్పుడు తట్టుకోలేకపోయారు. బండ జ్యోతి గారు ఫిబ్రవరి 27, 2016న తుదిశ్వాస విడిచారు, టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు ఈ లేడీ కామెడియన్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us