
ఒకప్పుడు అంటే సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చేశాయ్.. వరల్డ్ సినిమా అంతా మన ఇంట్లోకి వచ్చేసింది. ఎవరికి నచ్చిన జోనర్‌ని బట్టి వారు సినిమాలు చూసేయొచ్చు. కొత్త కొత్త వెబ్ సిరీస్‌లతో, సూపర్ కథలతో వీక్షకులను మెప్పిస్తున్నారు మేకర్స్. అయితే హర్రర్, థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అప్పట్లో హాట్ స్టార్ ఓటీటీలో వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా మంచి హిట్ అయింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. బ్లక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలకపాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలోనే ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. కాగా ఈ సినిమా అంత పెద్ద విజయం సాదిస్తుందని ఎవ్వరూ ఉంచలేదు. దాంతో మా ఊరి పొలిమేర 2 సినిమాను థియేటర్స్ లో విడుదలచేశారు. ఈ చిత్రంలో రాజేష్ భార్యగా నటించిన కామాక్షికి మంచి నేమ్ అండ్ ఫేమ్ దక్కాయి.. గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితీ దాసరికి కూడా మంచి గుర్తింపు అభించింది.
రాములు పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు. గెటప్ శ్రీను అర్ధాంగిగా.. రాజేష్‌పై మనసు పడ్డ మరదలిగా చక్కగా నటించారు. సినిమాల్లోకి రాక ముందు సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చాలా క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. సింగర్ సునీత కొడుకు హీరోగా నటించిన సర్కారు నౌకరి అనే సినిమాలోనూ నటించింది. చిన్న చిన్న సినిమాలతో మెప్పిస్తున్న సాహితి దాసరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి