
తెలుగు సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం కాదు. ఎప్పటికీ సినీ చరిత్రలో నిలిచిపోతుంటాయి. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమకథలలో మనసంత నువ్వే ఒకటి. దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్‌నే మలుపు తిప్పిన సినిమా ఇది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు మ్యూజికల్ సూపర్ హిట్. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయ్యింది. రిలీజ్ లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ నటించింది.
మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో తూనీగ తూనీగ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో ఉదయ్ కిరణ్, రీమాసేన్ చిన్ననాటి పాత్రలు కనిపిస్తాయి. మనసంతా నువ్వే చిత్రంలోని తూనీగ తూనీగ పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలనటి సుహాని కాలిటా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 2001లో విడుదలైన మనసంతా నువ్వేకు ముందే, 1996లో బాల రామాయణంలో ఆమె బాలనటిగా నటించారు. ఆ తర్వాత బాలతారగా హిందీ, బెంగాలీ, తమిళ్, మలయాళం సహా పలు భాషల్లో సినిమాలు చేశారు.
వెంకటేష్ నటించిన ప్రేమింటే ఇదేరా, గణేష్, అలాగే ఎలా చెప్పను వంటి చిత్రాల్లోనూ ఆమె కీలక బాల పాత్రలు పోషించారు. వయసు పెరిగిన తర్వాత సుహాని కాలిటా 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత సందీప్ కిషన్ సరసన నీ స్నేహ గీతం, శ్రీహరితో కలిసి శ్రీశైలం వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. నటనతో పాటు, ఆమె శాంసంగ్, నిరూప్, ఆర్‌ఎస్ బ్రదర్స్ వంటి పలు బ్రాండ్‌లకు మోడలింగ్ కూడా చేశారు. ప్రస్తుతం సుహాని తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. మొన్నీమద్యే విబర్ హసీజాతో ఆమె వివాహం జరిగింది. విబర్ హసీజా మ్యూజిక్ ఆర్టిస్ట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.