ఈ హాట్ బ్యూటీ అల్లరి నరేష్ హీరోయినా..!! అప్పటికంటే ఇప్పుడు మరింత గ్లామర్‌గా..
అల్లరి నరేష్ ప్రస్తుతం కామెడీ సినిమాలతో పాటు సీరియస్ సినిమాలు కూడా చేసి మెప్పిస్తున్నారు. గతంలో వరుసగా సినిమాలు చేసిన అల్లరి నరేష్.. ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన కెవ్వు కేక సినిమా గుర్తుందా.? ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ గుర్తుందా.?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు.. ఇలా వస్తున్నారు, అలా మాయమైపోతున్నారు. కొందరు ఒక్క సినిమాతోనే తెలుగు తెరకు దూరమవుతుంటే.. మరికొందరు ఛాన్స్‌లు లేక వేరే ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఇంకొందరు ఒకేఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారతారు. ఇక ఇప్పుడు మేము అలాంటి హీరోయిన్ గురించి చెప్పబోతున్నాం. ఈమె ఓ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ చిత్రంలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.
అయితేనేం ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందంతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇక తెలుగులోకి ఆమెకి అదే మొదట, ఆఖరి చిత్రం. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదు కన్నడ కస్తూరి షర్మీలా మంద్రే. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అందాల భామ.. ‘సజ్ని’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కన్నడంలో వరుస చిత్రాల్లో నటించిన ఈమె.. 2012లో ‘మిరత్తల్’ అనే తమిళ చిత్రంతో అటు తమిళనాట.. 2013లో ‘కెవ్వు కేక’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది.
అయితే ఆమె ఈ రెండు చిత్రాలు పెద్దగా ఉపయోగపడలేదు. రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. దీంతో షర్మీలా మళ్లీ కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. చిరంజీవి సర్జా, శివ రాజ్‌కుమార్, గణేష్, శ్రీమురళి వంటి ఆ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్‌గా మాత్రమే కాదు నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం 2024లో ‘అధిరష్టసాలి’, ‘దసరా’ అనే చిత్రాల్లో నటిస్తోంది ఈ వయ్యారి. ఇటీవల ఈమె వెకేషన్ ఫోటోలు, గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




