Varun Tej-Lavanya Tripathi: ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం.. వరుణ్, లావణ్య పెళ్లి ఖర్చు అంత తక్కువ ?..

అక్టోబర్ 30న పెళ్లి వేడుకలు ప్రారంభంకాగా.. నవంబర్ 1న అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అల్లు అర్జున్, నితిన్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసనతోపాటు.. మెగా హీరోస్ ఫోటోస్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత పవన్, చరణ్, చిరంజీవి కలవడం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అలాగే ఈ వేడుకలలో భాగంగా మెగా ప్రిన్సెస్ క్లింకారా

Varun Tej-Lavanya Tripathi: ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం.. వరుణ్, లావణ్య పెళ్లి ఖర్చు అంత తక్కువ ?..
Varun Tej, Lavanya Tripathi

Updated on: Nov 03, 2023 | 5:15 PM

మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలతోపాటు.. అతి కొద్ది మంది స్నేహితులు హాజరయ్యారు. అక్టోబర్ 30న పెళ్లి వేడుకలు ప్రారంభంకాగా.. నవంబర్ 1న అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అల్లు అర్జున్, నితిన్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసనతోపాటు.. మెగా హీరోస్ ఫోటోస్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత పవన్, చరణ్, చిరంజీవి కలవడం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అలాగే ఈ వేడుకలలో భాగంగా మెగా ప్రిన్సెస్ క్లింకారా ఫోటోస్ సైతం ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా వరుణ్, లావణ్య వివాహం గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నివేదికల ప్రకారం వీరి పెళ్లికి కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి ఎరుపు రంగు చీరలో మరింత అందంగా కనిపించింది లావణ్య. ఆమె ధరించిన ఆ శారీ ధర రూ. 10 లక్షలు ఉంటుందని సమాచారం. ఇటలీలోని శాన్ ఫెలిస్ గ్రామంలో 30 సూట్లు, చారిత్రాత్మక గృహాల నుండి 29 గదులతో కూడిన రిసార్ట్‌గా మార్చినట్లు టాక్. అక్కడ అందమైన విల్లాలు, సంపన్నమైన గదులు , విలాసవంతమైన భోజన అనుభవాలు ఫోటోలలో కనిపించాయి.

పెళ్లిలో వరుణ్ తేజ్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వానీని ధరించాడు. ఇక లావణ్య మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాంచీపురం చీరను కూడా ధరించింది. ఇక వీరి వివాహనికి అశ్విన్ మావ్లే , హసన్ ఖాన్ స్టైలిస్ట్‌లు. గతంలో జూన్ 9న హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ది సియాసత్ డైలీ కథనం ప్రకారం ఒక్కో ఉంగరాల విలువ రూ.25 లక్షలు.

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ 2014లో ముకుంద సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఫిదా, కంచె, లోఫ, F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌తో సహా పలు చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 8న విడుదల కానుంది. ఈనెల 5న హైదరాబాద్ మాదాపూర్ లో టాలీవుడ్ అథిదుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట.