
ఇప్పుడంటే టిక్ టాక్ బ్యాన్ అయ్యిందిగాని.. ఒకప్పుడు మాత్రం రచ్చ రచ్చ చేసేవారు నెటిజన్స్. అబ్బో రకరకాల వీడియోలు చేస్తూ తెగ సందడి చేసేవారు. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ మీద పడ్డారు.. చాలా మంది రకరకాల వీడియోలో చేస్తూ మెప్పిస్తున్నారు. కాగా టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఉప్పల్ బాలు ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలు. తనదైన స్టైల్ లో వీడియోలు చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు ఉప్పల్ బాలు. ఫోన్ లో ఉప్పల్ బాలు వీడియో కనిపిస్తే చాలు ప్రేక్షకులను తెగ నవ్వుకునేవారు. ఎప్పుడూ నవ్వులు పూయించే ఉప్పల్ బాలు జీవితంలో ఎంతో విషాదం ఉందని చాలా తక్కువ మందికే తెలుసు.
తెలుగు రాష్ట్రాల్లో ఉప్పల్ బాలు గురించి తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. సెలబ్రెటీలు కూడా కొంతమంది ఉప్పల్ బాలును ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఒకటి రెండు సినిమాల్లోనూ కనిపించాడు ఉప్పల్ బాలు. ప్రస్తుతం ఉప్పల్ బాలు పలు ఈవెంట్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఉప్పల్ బాలు తన కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తూ.. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం బాలు బాలుని హియ్యా మండి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఆ హోటల్ బ్రాండ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు బాలు. కాగా ఇలా హియ్యా మండి బ్రాండ్ ప్రమోషన్స్ తోప్ నెలకు లక్షరూపాయిల వరకు సంపాదిస్తున్నడని తెలుస్తుంది. కాగా టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలు పెట్టిన తర్వాత తన బందవులందరూ దూరం చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అప్పుడు నీకు మాకు సంబంధం లేదు అని అవమానించిన వారే ఇప్పుడు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తుంటే ఇంటికి రావాలని పిలుస్తున్నారని బాలు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే బాలు తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదు.. 30లక్షలు ఇస్తామన్న కూడా బెట్టింటి యాప్స్ ను ప్రమోట్ జోలికి వెళ్లలేదని అని బాలు తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.