Rashmika Mandanna: రేంజ్ పెరిగింది.. రెమ్యునరేషన్ పెంచేసింది.. సికిందర్ కోసం నేషనల్ క్రష్ ఎంత అందుకుంటుందంటే

ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ అంటే రష్మిక మందన్నా. ఇన్నాళ్లు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటుతుంది. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

Rashmika Mandanna: రేంజ్ పెరిగింది.. రెమ్యునరేషన్ పెంచేసింది.. సికిందర్ కోసం నేషనల్ క్రష్ ఎంత అందుకుంటుందంటే
Rashmika

Updated on: Mar 15, 2025 | 12:01 PM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కన్నడ ఇండస్ట్రీ  నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలివుడ్ లో తోపు హీరోయిన్ గా మారిపోయింది. ఛలో సినిమాతో హీరోయిన్  గా అడుగుపెట్టిన ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీవిజయాన్ని అందుకుంది. దాంతో రష్మిక పేరు మారుమ్రోగింది. ఆతర్వాత తమిళ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ హిట్ అందుకుంది.

అలాగే బాలీవుడ్ లో యానిమల్, ఛావ సినిమాలతో రెండు భారీ హిట్స్ అందుకుంది.  ఇక ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది రష్మిక. ఒకొక్క సినిమాకు రష్మిక కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటుంది. స్టార్ డమ్ పెరిగే కొద్దీ రష్మిక రెమ్యునరేషన్ పెంచేస్తుంది. ప్రస్తుతం ఒకొక్క సినిమాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో చేస్తున్న సినిమాకు భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో సినిమా చేస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రష్మిక మందన్న తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ సినిమా కోసం రష్మిక భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. సికిందర్ సినిమాకోసం రష్మిక రూ. 5 కోట్లు తీస్కుంటుందట. ఇప్పుడు ఇది అక్కడ హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన ఛావా సినిమాకు రష్మిక రూ.4కోట్లు తీసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..