Keerthy Suresh: ‘మహానటి’ మొదటి రెమ్యునరేషన్‌ మరీ అంత తక్కువనా? ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా?

|

Aug 07, 2023 | 7:41 AM

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తిసురేష్‌ ఒకరు. ఓవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మహేశ్‌ బాబుతో నటించిన సర్కారువారి పాట, నాని దసరా సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే భోళాశంకర్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో మెగాస్టార్‌ చెల్లెలిగా కీర్తి కనిపించనుంది.

Keerthy Suresh: మహానటి మొదటి రెమ్యునరేషన్‌ మరీ అంత తక్కువనా? ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా?
Keerthy Suresh
Follow us on

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తిసురేష్‌ ఒకరు. ఓవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మహేశ్‌ బాబుతో నటించిన సర్కారువారి పాట, నాని దసరా సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే భోళాశంకర్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో మెగాస్టార్‌ చెల్లెలిగా కీర్తి కనిపించనుంది. కాగా రెండు మూడు సినిమాల్లో బాలనటిగా నటించిన ఈ మలయాళ నటి 2013లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో బోలెడు డిమాండ్ ఉన్న నటీమణుల్లో కీర్తి ఒకరు. అలాగే దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో కూడా ముందుందీ అందాల తార. ప్రస్తుం ఒక్కోసినిమాకీ మూడు కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటోంది కీర్తి సురేష్. కాగా ఇప్పుడింత భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటోన్న మహానటి మొదట ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా? కేవలం రూ. 500 మాత్రేమ నట. కీర్తి సురేష్ చిన్నతనం నుండి ఫ్యాషన్, నాటకాలపై ఆసక్తిని పెంచుకుంది. దీనికి తోడు కీర్తి తల్లి దండ్రులు కూడా సినీరంగానికే చెందిన వారే కావడంతో మహానటి మనసు సినిమాలపై మళ్లింది.

తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే..

తల్లిదండ్రుల్లాగే కూతురికి కూడా కళలంటే చాలా ఆసక్తి. చిన్న వయసులోనే నటించడం ప్రారంభించింది. బాలనటిగా రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది. కాగా కీర్తి సురేష్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఆ ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు కీర్తి సురేష్ కు ఐదు వందల రూపాయలు పారితోషికం తీసుకున్నారట. కీర్తి సురేష్ క్లెయిమ్ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఇదే. 2013లో కాలేజీలో చదువుతున్నప్పుడు సెమిస్టర్ విరామంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతాంజలి’ అనే హారర్ మూవీలో కీర్తి ద్విపాత్రాభినయం చేసింది. సినిమా ఓ మోస్తరుగా నడిచినప్పటికీ, కీర్తి నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ మరుసటి సంవత్సరం అంటే 2014లో కీర్తి సురేష్ ‘రింగ్ మాస్టర్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె అంధ యువతిగా నటించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు కీర్తి నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. అయితే సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక 2015లో ‘ఇటు ఎన్న మాయం’ అనే తమిళ్‌ సినిమాలో నటించింది. అయితే సినిమా ఫ్లాప్‌గా మిగిలింది.

ఇవి కూడా చదవండి

నేను శైలజతో క్రేజ్‌..

కాగా తెలుగులో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘నేను శైలజ’ సినిమా పెద్ద హిట్ అయింది. కీర్తి సురేష్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కీర్తి. ‘నేను శైలజ’ సినిమా తర్వాత కీర్తి ఎంత బిజీ అయిందంటే 2014 తర్వాత 2021 వరకు ఒక్క మలయాళ సినిమాలో కూడా నటించలేకపోయింది. 2023లో ఆమె నటించిన మూడు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రెండు కొత్త సినిమాలు అంగీకరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..