సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లు .. సీరియల్స్ వస్తున్నానంటే చాలు టీవీలకు అతుక్కు పోతారు. ఇప్పుడు పదుల సంఖ్యలో సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు సీరియల్స్ అంటే మూడు నాలుగు పేర్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి.. కానీ ఇప్పుడు చాలా రకాల సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. వీటికి తోడు హిందీ సీరియల్స్ కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకులను మెప్పించిన సీరియల్స్ లో మొగలి రేకులు సీరియల్ మొదటి వరసలో ఉంటుంది. ఈ సీరియల్ సంవత్సరాల పాటు సాగింది.. మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చిన ఈ సీరియల్ లో నతినిన నటీ నటులు కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
అలాగే ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించిన ఆర్ కే నాయుడు అలియాస్ సాగర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. చక్రవాకం సీరియల్లో మధ్యలో సాగర్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అలాగే మొగలి రేకులు సీరియల్ లోనూ అతను మెయిన్ లీడ్ గా నటించాడు. అంతే కాదు మొగలి రేకులు సీరియల్ లో డ్యూయల్ రోల్ లో నటించాడు. సీరియల్ నుంచి సినిమాల్లోకి కూడా వచ్చాడు సాగర్.
సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్.. సినిమాల్లో కూడా నడిచాడు. మొన్నామధ్య సాగర్ హీరోగా ఓ సినిమా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే సాగర్ సతీమణిని ఎప్పుడైనా చూశారా.? సాగర్ భార్య పేరు సౌందర్య. 2017లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సౌందర్య చాలా అందంగా ఉంటారు. హీరోయిన్ లా చూడచక్కగా ఉంటారు ఆమె.. ఆమె సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వ్యక్తి కాదు. పార్టీవేర్ శారీస్ పేరుతో ఓ బిజినస్ చేస్తున్నారు సౌందర్య. సాగర్ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం సాగర్ 100 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు సాగర్.