అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..! ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే

రిచా పల్లాడ్ ఈ పేరు చెబితే పెద్దగా ఐడియా రాకపోవచ్చు కానీ.. సూపర్ హిట్ నువ్వే కావాలి సినిమాలో హీరోయిన్ అనగానే.. ఓ ఆమె ఎందుకు తెలీదు అనేస్తారు. విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తరుణ్,రిచా పల్లాడ్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా వచ్చి 22 ఏళ్లు దాటింది.

అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..! ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Actress

Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 05, 2025 | 7:39 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ రాణించాడు తరుణ్. ఎన్నో సూపర్ హిట్ ప్రేమకథలతో ప్రేక్షకులను అలరించాడు. అప్పట్లో తరుణ్ లవ్ స్టోరీ మూవీస్ కు యూత్ లో ఎక్కువగా క్రేజ్ ఉండేది. ఇప్పటికీ తరుణ్ చిత్రాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతేకాదు తరుణ్ సినిమాలోని సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.  తరుణ్ నటించిన సూపర్ హిట్ ప్రేమకథలలో చిరుజల్లు ఒకటి. 2001లో ఆగస్ట్ 17న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. ఇందులో తరుణ్ సరసన రిచా పల్లాడ్ కథానాయికగా మెరిసింది. ఈ మూవీలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో తరుణ్ సరసన నటించిన రిచా పల్లాడ్ గుర్తుందా…? అప్పట్లో ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు ఒకప్పుడు హిట్ పెయిర్. ఈ సినిమా కంటే ముందు ఇద్దరు కలిసి నటించిన నువ్వే కావాలి మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది.

రిచా పల్లాడ్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. హోలీ, నా మనసిస్తారా, పెళ్లాం పిచ్చోడు వంటి చిత్రాల్లో మెరిసింది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషలలోనూ నటించింది.2016 తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యింది రిచా పల్లాడ్. 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి 2013లో ఒక కుమారుడు జన్మించాడు. 2018లో ఖాన్ నెంబర్ 1 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. 2020లో లాల్ ఇష్య్కూ అనే వెబ్ సిరీస్.. యువర్ హానర్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..