హేయ్.. అదితి ఇది నువ్వేనా..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గంగోత్రి హీరోయిన్

|

Jan 10, 2025 | 9:19 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు అల్లు అర్జున్. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

హేయ్.. అదితి ఇది నువ్వేనా..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గంగోత్రి హీరోయిన్
Gangotri Movie
Follow us on

ప్రస్తుతం దేశం మొత్తం దున్నేస్తుంది అల్లు అర్జున్ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1800కోట్లకు పైగా వసూల్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. మొన్నటివరకు లవర్ బాయ్ గా అలరించిన అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్ లోకి మారి పుష్ప సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అలాగే సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : వాసివాడి తస్సాదియ్యా..! బంగార్రాజు బ్యూటీ అందాల బీభత్సం.. చూస్తే పడిపోవాల్సిందే

ఇక బన్నీ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన గంగోత్రి సినిమా గుర్తుందా.? తొలి సినిమా నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎన్నో విజయాలను అందుకున్నాడు. పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. కాగా గంగోత్రి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ఆర్తి అగర్వాల్ సిస్టర్ అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిన్నది ఆ సినిమా తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. గంగోత్రి తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Vishal: విశాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

గంగోత్రి సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించింది. గంగోత్రి సినిమా తర్వాత కొడుకు, విద్యార్థి,లోకమే కొత్తగా, ఏంబాబు లడ్డుకావాలా..? వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా రాణించలేదు. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ అమ్మడు. కాగా ఈ చిన్నది అప్పట్లో ఓ కాంట్రవర్సీలోనూ ఇరుక్కుంది. ఓ జర్నలిస్టు పై దాడి కేసులో తండ్రి, సోదరుడితో పాటు అదితి కూడా జైల్లో ఉండాల్సివచ్చింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు అదితి అగర్వాల్. దాంతో ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న అదితి ఫోటో షాక్ కు గురిచేస్తుంది. ఆమె లుక్ చాలా మారిపోయింది. అదితి ఇది నువ్వేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

  1. మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి