
ఇప్పుడంటే బోల్తా పడుతున్నాడు కానీ.. ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. హీరోలను నెక్ట్స్ రేంజ్‌కు ఎలివేట్ చేసిన చరిత్ర ఆయనది. ఒకటా, రెండా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన 143 సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇందులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. 2004 విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది. బ్రహ్మానందం , బ్రహ్మాజీ, ఎంఎస్ నారాయణ , అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం , ఆశా సైని కీలక పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సాయి రామ్ శంకర్‌కు జోడీగా నటించిన కథానాయకి మీకు గుర్తుందా..? తను ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? ఏం చేస్తుంది.. తెలుసుకుందాం..!
143 సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ అందాల హీరోయిన్ పేరు సమీక్ష సింగ్. ఈ అమ్మడు తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. అంతే కాదు.. చాలా మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. సమీక్ష సింగ్ ఫస్ట్ మూవీ 143నే.. ఈ సినిమా తర్వాత ఈ భామ వరస సినిమాలు చేసింది. అరింతుమ్ అరియమలుమ్ అనే సినిమాతో తమిళనాట అడుగుపెట్టింది. కానీ అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. 143 సినిమా తర్వాత కొత్త కథ, ఇది సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి వంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.
అలాగే పలు సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. 2020లో, సింగపూర్‌లో సింగర్ షేల్ ఓస్వాల్‌ని సమీక్షసింగ్ మ్యారేజ్ చేసుకుంది. భర్తతో కలిసి మాక్స్, మిన్ , మియోజాకి సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ మంచి యాక్టవ్ గా ఉంటుంది. ఈముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి