ఇదెక్కడి ట్విస్ట్ రా సామి.. !! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆంధ్రుడు మూవీ హీరోయిన్

|

Jun 07, 2024 | 1:01 PM

గోపీచంద్ చంద్ హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈ యాక్షన్ హీరో భీమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన ఆంధ్రుడు సినిమా గుర్తుందా.? ఈ యాక్షన్ అండ్ లవ్ డ్రామా 2005 లో విడుదలైంది. ఈ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కిన అప్పటి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.  

ఇదెక్కడి ట్విస్ట్ రా సామి.. !! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆంధ్రుడు మూవీ హీరోయిన్
Andhrudu Movie
Follow us on

కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా నటించి ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు గోపీచంద్. యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాల్ హీరో. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ గోపీచంద్ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గోపీచంద్ చంద్ హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈ యాక్షన్ హీరో భీమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన ఆంధ్రుడు సినిమా గుర్తుందా.? ఈ యాక్షన్ అండ్ లవ్ డ్రామా 2005 లో విడుదలైంది. ఈ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కిన అప్పటి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఆంధ్రుడు మూవీ నిజంగా ఓ అండర్ రేటెడ్ మూవీ అనే చెప్పాలి. ఇప్పుడు చూస్తే మంచి సినిమా అప్పుడు ఎలా మిస్ అయ్యాం అనే ఫీల్ కలుగుతుంది. ఈ సినిమాకు పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికి ఈ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా.? క్యూట్ లుక్స్ తో చాలా పద్దతిగా ఈ సినిమాలో కనిపిస్తుంది ఆమె. ఆమె పేరు గౌరిపండిట్.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన గౌరీ ఆంధ్రుడు సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో కాస్కో, ఆకాశ రామన్న, నిత్య పెళ్లికొడుకు, హౌస్ పుల్ లాంటి సినిమాల్లో నటించింది. ఆతర్వాత ఈ చిన్నది సినిమాలకు దూరం అయ్యింది. 2006 నుండి బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదితో డేటింగ్ చేసిన గౌరీ పండిట్ 2011, మార్చి 7న వివాహం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. గౌరీకి సంబందించిన ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో చూడటానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.