
తెలుగు చిత్రపరిశ్రమలో విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యాడు గణేశ్ వెంకట్రామన్. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన ఢమరుకం సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తూనే అద్భుతమైన నటనతో విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టాడు గణేశ్. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించాడు. 2009లో వచ్చిన ఈనాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇందులో ఇన్స్పెక్టర్ అరీఫ్ ఖాన్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ఢమరుకం మూవీతో మెప్పించాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత తెలుగులో త్రిష ప్రధాన పాత్రలో నటించిన నాయకి సినిమాలో కనిపించాడు గణేశ్.
అయితే నటుడిగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ గణేశ్ వెంకట్రామన్ కు తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. రాగాల 24 గంటల్లో, అంతిమ తీర్పు, శబరి వంటి చిత్రాల్లో నటించాడు. తమిళంలో సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేస్తున్నాడు. అలాగే పలు రియాల్టీ షోలలో పాల్గొన్నాడు. తమిళంలో బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని 3వ రన్నరప్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. గణేశ్ వెంకట్రామన్ భార్య సైతం తెలుగులో తోపు హీరోయిన్. ఆమె పేరు నిషా కృష్ణన్. విశాల్ నటించిన ఇంద్రుడు సినిమాలో కథానాయికగా నటించింది. అలాగే కృష్ణుడికి వారసుడు అనే సినిమాలోనూ నటించింది.
తెలుగులో శ్రీమంతుడు అనే సీరియల్ హీరోయిన్ గా చేసింది. ఈ సీరియల్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా తమిళంలో వచ్చిన మహాభారతం సినిమాలో ద్రౌపది పాత్రలో నటించింది. ప్రస్తుతం నిషా కృష్ణన్ సినిమాలకు దూరంగా ఉంటుంది. గణేశ్ వెంకట్రామన్, నిషా కృష్ణన్ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం నిషా కృష్ణన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..