Revanth Reddy: తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? ఇది అస్సలు ఊహించలేరు
అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించిన కాంగ్రెస్ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. టీపీసీసీ ప్రసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాలనుంచి పోటీ చేశారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి .. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తుంది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించిన కాంగ్రెస్ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. నిన్నటి వరకు టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాలనుంచి పోటీ చేశారు రేవంత్ రెడ్డి. కొండగల్ లో భారీ మెజారిటీతో గెలుపొందిన రేవంత్ కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు.
ఇక రేవంత్‌రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించాడు. అలాగే 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానికసంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించాడు. అలాగే 2014లో రెండోసారి ఎమ్మెల్యే గా గెలిచారు. 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నాడు. 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు సీఎం రేస్ లో ఉన్నారు.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ఫెవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? అప్పట్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన అభిమాన హీరో గురించి చెప్పారు. ఇప్పుడైతే సినిమాలు పెద్దగా చూడటం లేదు కానీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తన ఫేవరెట్ హీరో అని చెప్పారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కృష్ణ సినిమాలు చేసేవాడిని అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.