Tollywood: ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఆస్తులు.. ఐశ్వర్యరాయ్ మాత్రం కాదండోయ్..

|

Aug 30, 2024 | 8:26 AM

ఒకప్పుడు ఆడపాదడపా సినిమాలు చేసిన ఆ బ్యూటీ.. అప్పట్లో టాప్ హీరోయిన్ కూడా కాదు. అసలు పాన్ ఇండియా లెవల్లో ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. అయినా స్టార్ హీరోయిన్లను బీట్ చేసి ఆస్తులు సంపాదించింది. తాజాగా గురువారం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేయగా.. అందులో ఆ బ్యూటీ రూ.4600 కోట్ల సంపదతో టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ?

Tollywood: ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఆస్తులు.. ఐశ్వర్యరాయ్ మాత్రం కాదండోయ్..
Actress New
Follow us on

ప్రస్తుతం సినీరంగంలో అత్యంత ఎక్కువ బడ్జెట్‏తో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఒక్కో హీరో దాదాపు రూ.100 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ సైతం ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరో..? సినిమాలు ఎక్కువ చేయలేదు.. అంతగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకోలేదు.. కానీ ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఒకప్పుడు ఆడపాదడపా సినిమాలు చేసిన ఆ బ్యూటీ.. అప్పట్లో టాప్ హీరోయిన్ కూడా కాదు. అసలు పాన్ ఇండియా లెవల్లో ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. అయినా స్టార్ హీరోయిన్లను బీట్ చేసి ఆస్తులు సంపాదించింది. తాజాగా గురువారం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేయగా.. అందులో ఆ బ్యూటీ రూ.4600 కోట్ల సంపదతో టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తనే జూహీ చావ్లా.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్. ఒకప్పుడు హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇప్పుడు ఆమె హురున్ ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్. సెలబ్రెటీల లిస్ట్ లో షారుక్ ఖాన్ తోపాటు స్థానం సంపాదించిన ఏకైక నటి. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలాంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో జూహీ చావ్లా కూడా ఉండడం విశేషం. 15 ఏళ్లుగా పెద్దగా సినిమాలు చేయని జూహీ.. ఏకంగా రూ.4600 కోట్లకు యజమాని అంటే ఆశ్చర్యపోతున్నారు జనాలు. నిజానికి హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో కనీసం రూ.1000 కోట్లకు పైగా సంపద కలిగి ఉన్న భారతీయులకు చోటు దక్కుతుంది. ఈసారి ఈ జాబితాలో కొత్తగా 220 మంది చేరగా.. మొత్తం 1539 మంది ఉన్నారు. బాలీవుడ్ బాద్ షా రూ.7300 కోట్ల సంపదతో ఇండియాలోనే అత్యధిక ధనవంతుడైన సెలబ్రెటీగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత రూ.4600 కోట్ల సంపదతో జూహీ చావ్లా నిలిచింది. అప్పట్లో వీరిద్దరి కాంబోలో మంచి సినిమాలు వచ్చాయి. 1990 ఇండస్ట్రీలో దూసుకుపోయిన హీరోయిన్లలు ఈమె ఒకరు. ఆమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీతో అరంగేట్రం చేసిన జూహీ చావ్లా.. పదేళ్లకు పైగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. 2000 తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ హీరోయిన్ ను అమితంగా ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అందుకు జూహీ చావ్లా తండ్రి అంగీకరించలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.