
ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సినిమా యానిమల్. అర్జు్న్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అలాగే ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్తాయిలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇవాళ్టి వరకు దాదాపు రూ.425 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో రణబీర్ ఊర మాస్ నటన.. డైరెక్టర్ సందీప్ మేకింగ్ యూత్‌కు తెగ నచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ ఇస్తూ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇతర డైరెక్టర్స్. తండ్రిపై కొడుకుకు ఉండే ప్రేమను.. ఫ్యామిలీ అంటే ఉండే ఎమోషన్‌ను ఎంతో వైల్డ్ గా చూపించి ప్రేక్షకుల మతిపోగొట్టాడు సందీప్. ప్రతి సీన్ చాలా కొత్తగా చూపించాడు. ఇక ఈ సినిమాకు రణబీర్, రష్మిక, అనిల్, బాబీ నటనతోపాటు మ్యూజిక్ సైతం హైలెట్ అయ్యింది. ఈ సినిమాలోని ప్రతిసాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి.
అయితే ఈ సినిమాకు కొన్ని సన్నివేశాల్లో ఇతర సినిమాల్లోని సాంగ్స్ ఉపయోగించారు. అరబ్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రణబీర్ కపూర్ సినిమాలో యాంగ్ క్యారెక్టర్ గా ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన సీన్ చాలా హైలెట్ అయ్యింది. ఇందులో చిన్ని చిన్ని ఆశ అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత హిట్ అయ్యింది. అయితే అందులో రణబీర్ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఆ స్టెప్పులను అంత స్టైలీష్ గా కంపోజ్ చేసింది బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్. అవును. మొన్నటి వరకు తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించిన ఆట సందీప్. ఈ విషయాన్ని సందీప్ స్వయంగా తెలియజేశాడు.
ఇలాంటి మంచి ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉందని.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే రణబీర్ కపూర్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ రణబీర్ డాన్స్ చేసిన వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశాడు సందీప్. ప్రస్తుతం అతని పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. దీంతో అతడికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా మరిన్ని రోజుల్లో రూ.1000 కోట్లకు చేరువ కావడం ఖాయమంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.