ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్ సునీల్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సునీల్. దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సునీల్. సునీల్ మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్నాడు. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రమ్ సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. ఇక కమెడియన్ గా సునీల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. సునీల్ కేవలం నటుడిగానే కాక హీరోగా, మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకొన్నాడు. అందాలరాముడు సినిమాలో మొదటిగా సునీల్ హీరోగా నటించాడు.
ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో చేసిన మర్యాద రామన్న సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు సునీల్ కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. దాంతో విలన్ అవతారమెత్తాడు. విలన్ గా సునీల్ కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన వరుసగా విలన్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే పై ఫొటోలో సునీల్ తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మహేష్ బాబు హీరోయిన్ సిస్టర్.
అవును పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె పేరు మన్నారా చోప్రా. ఈ అమ్మడు తెలుగు , హిందీ భాషల్లో సినిమాలు చేసింది. అలాగే సునీల్ తో కలిసి జక్కన్న అనే సినిమా చేసింది. మన్నారా చోప్రా గ్లోబల్ బ్యూటీ ప్రియక చోప్రా కజిన్. ఈ అమ్మడు ప్రేమ గీమ జాన్‌తా నయ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. జక్కన్న, తిక్క, రోగ్, సీత సినిమాల్లో నటించింది. అలాగే హిందీలోనూ కొన్ని సినిమాల్లో కనిపించింది. అలాగే హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ అమ్మడు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తన అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది ఈ వయ్యారి భామ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.