Rajamouli: డైరెక్టర్ రాజమౌళి ఆఫర్ రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. ఆ ఒక్క కారణంతో..

డైరెక్టర్ రాజమౌళి.. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్. బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆస్కార్ వేదికపై నిలబెట్టిన స్టార్ డైరెక్టర్. కానీ మీకు తెలుసా.. జక్కన్న మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిందట ఓ హీరోయిన్.

Rajamouli: డైరెక్టర్ రాజమౌళి ఆఫర్ రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. ఆ ఒక్క కారణంతో..
Rajamouli

Updated on: Feb 12, 2025 | 9:13 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుడు. బాహుబలి సినిమాతో తెలుగుసినిమా పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమను ఆస్కార్ వేదికపై నిలబెట్టిన ఏకైక డైరెక్టర్. రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే నటించాలని ఎంతో మంది హీరోహీరోయిన్స్ కోరుకుంటారు. కానీ జక్కన్న ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు. సౌత్ క్వీన్ త్రిష. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో మర్యాద రామన్న ఒకటి. 2010లో విడుదలైన ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ కమెడియన్ సునీల్ హీరోగా నటించారు.

అయితే ఇందులో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం ముందుగా త్రిషను అనుకున్నారట. కానీ అప్పటికే ఇండస్ట్రీలో త్రిష టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అప్పుడే సునీల్ సినిమాలో ఛాన్స్ కావడంతో త్రిష సున్నితంగా తిరస్కరించారని టాక్. దీంతో ఆమె స్థానంలోకి హీరోయిన్ సలోనిని ఎంపిక చేసుకున్నారు. సునీల్, సలోని జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన త్రిష.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవలే అజిత్ జోడిగా విడాముయార్చి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే అజిత్, త్రిష కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన