
చాలా ఏళ్ల తర్వాత హీరో వడ్డే నవీన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ నార్ల తెరకెక్కించిన ఈ సినిమాల నవీన్ సరసన రాశీసింగ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇప్పటిదాకా రిలీజైన కంటెంట్ బట్టి చూస్తే ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు ఒక పక్కా పొలిటికల్, క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. కాగా ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ట్యాగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. త 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు చిత్రంతో హీరోగా పరిచయమైన అతను ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు. పెళ్లి, మనసిచ్చి చూడు, లవ్ స్టోరీ 1999, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు – మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి వంటి ఎన్నో మంచి సినిమాలు నవీన్ కెరీర్ లో ఉన్నాయి. అయితే 2010 తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో మాత్రమే కనిపించారు. మళ్లీ ఇప్పుడు సుమారు పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నరీ సీనియర్ హీరో.
సినిమాల సంగతి తప్పితే వడ్డే నవీన్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదేంటంటే ఆయన టాలీవుడ్ లో ఓ బడా ఫ్యామిలీకి చెదిన అమ్మాయిని పెళ్లాడారు. నవీన్ తండ్రి ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్‌కి ఇచ్చి వివాహం చేశారు పెద్దలు. అంటే ఆమె నందమూరి బాలకృష్ణకు కూతురు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు సోదరి వరస అవుతుంది. అయితే ఈ జంట ఇప్పుడు విడిపోయారు. కొన్నేళ్లు బాగానే కాపురం చేసిన వీరు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. దీని తర్వాత నవీన్ మరో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.