Murali Sharma: ఓర్నీ.. ఇదేం ట్విస్ట్… నటుడు మురళి శర్మ భార్య ఆ నటా..?

|

Oct 11, 2024 | 9:26 AM

ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే బిజీ ఆర్టిస్ట్ మురళీ శర్మ. ఈయన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన భార్య కూడా నటే.. ఆమె ఎవరో మీకు తెల్సా..?

Murali Sharma: ఓర్నీ.. ఇదేం ట్విస్ట్... నటుడు మురళి శర్మ భార్య ఆ నటా..?
Murli Sharma
Follow us on

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ మురళి శర్మ. ఈయనకు తెలుగు మూలాలు ఉన్నాయి. మురళీ శర్మ తెనాలిలో ఫుట్టి.. ముంబైలో పెరిగారు. ఆయన తల్లి తెలుగువారు కాగా, తండ్రి మరాఠి. రోషన్ తనేజా ఇనిస్టిట్యూట్‌లో ఆయన యాక్టింగ్ కోర్సు చేశారు. తొలుత హిందీ చిత్రాల్లో చేసిన ఆయన.. ఆ తర్వాత.. తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన తెలుగులో ప్రజంట్ మస్త్ జోరు చూపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,  అల వైకుంఠపురంలో ఇలా చాలా సినిమాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించారు. మురళి శర్మ కోసం దర్శకులు ప్రత్యేక క్యారెక్టర్స్ రాస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి: సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు త‌న‌కే కాల్ చేసింద‌ట‌…ఓపెన్ అయిన స్టార్ హీరో..

అయితే మురళి శర్మ భార్య కూడా నటి అని మీకు తెల్సా..? . ఆయన భార్య పేరు అశ్విని కల్సేకర్. ఆమె కూడా బిజీ ఆర్టిస్ట్. హిందీలో అనేక సీరియల్స్, సినిమాలు చేశారు. సీఐడీ సీరియల్ ద్వారా ఇటు తెలుగు అడియన్స్‌కు కూడా సుపరిచితురాలే. అశ్విని కల్సేకర్ అల్లు అర్జున్ బద్రినాథ్ సినిమాలో మంచి రోల్ చేశారు.  “నేనేవరో తెలుసా.. నీ మేనత్తను.. ఈ రాష్ట్రాన్ని పాలించే సర్కార్ భార్యను. ఒక్కసారి అత్త అని పిలవ్వే” అనే డైలాగ్ వింటే మాత్రం.. ఓ తనా అనుకుంటారు. ఈ మూవీలో తమన్నా మేనత్త పాత్రలో నటించారు అశ్విని కల్సేకర్. ఆ తర్వాత రవితేజ నటించిన నిప్పు మూవీలోనూ యాక్ట్ చేశారు. తెలుగులో ఆమె చివరిసారిగా మెహబూబ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మరాఠిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Murali Sharma Wife

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.