ఇది కదా సినిమా అంటే..! పెద్ద హీరోలు లేరు, ప్రమోషన్స్ లేవు.. రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ చిన్న సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇది కదా సినిమా అంటే..! పెద్ద హీరోలు లేరు, ప్రమోషన్స్ లేవు.. రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
Movie News

Updated on: Dec 17, 2025 | 10:46 AM

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాలను అందుకుంటుంటాయి. చిన్న సినిమాలుగా వచ్చిన సినిమాలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుండటంతో సినిమాలన్నీ పలు భాషల్లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం రూ. 50లక్షలతో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే..

విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. లిటిల్ హార్ట్స్, మహావతార్ నరసింహా రీసెంట్ గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు అదే కోవకు చెందినవి.. ఇక ఇప్పుడు చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా విపరీతంగా వచ్చి పడ్డాయి ఈ సినిమాకు.. ప్రమోషన్స్ లేకుండా.. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 50లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 100కోట్లకు పైగా రాబట్టింది.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

ఈ సినిమా తెలుగులో తెరకెక్కిన మూవీ కాదు.. గుజరాత్ లో తెరకెక్కింది ఈ సినిమా.. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలై 50 రోజులు కావస్తున్నా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఈ సినిమా పేరు లాలో.. అంకిత్ సఖియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..