Vishal: హీరో విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా.. ? రజినీతో సూపర్ హిట్ మూవీ చేసిన క్రేజీ హీరోయిన్

కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. ఇప్పటివరకు మాస్ యాక్షన్ చిత్రాలతోపాటు ప్రేమకథలతోనూ జనాలను ఆకట్టుకున్నారు. కానీ కొన్ని రోజులుగా విశాల్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి ధన్సికతో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల ప్రకటించారు విశాల్.

Vishal: హీరో విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా.. ? రజినీతో సూపర్ హిట్ మూవీ చేసిన క్రేజీ హీరోయిన్
Vishal

Updated on: Aug 29, 2025 | 4:59 PM

కోలీవుడ్ హీరో విశాల్.. తమిళ్ హీరోయిన్ సాయి ధన్సికను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఇటీవల ఓ మూవీ వేడుకలో తన ప్రేమ, పెళ్లి విషయం బయటపెట్టిన విశాల్.. శుక్రవారం ఆమెతో నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తన పుట్టినరోజు నాడే ఎంగేజ్మెంట్ జరగడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమ నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. తమకు అందరి ఆశీస్సులు కావాలని.. త్వరలోనే పెళ్లి తేదీని వెల్లడిస్తామని అన్నారు. దీంతో ఇప్పుడు విశాల్, సాయి ధన్సికలకు నెట్టింట సినీతారలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్‏లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..

ప్రస్తుతం విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. సాయి ధన్సిక తమిళ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెగా బ్లాక్ బస్టర్ హిట్ కబాలి చిత్రంలో కనిపించింది. 2016లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే పరదేశి సినిమాతోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈచిత్రానికి ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సైతం అందుకుంది. అలాగే ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డు గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

2012లో విడుదలైన అరవన్ సినిమాకు ఆమె ఎడిసన్ అవార్డ్ ఫర్ మోస్ట్ డేరింగ్ రోల్ అవార్డ్ అందుకుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ భాషలలోనూ నటించి మెప్పించింది. ఇటీవల మేలో సాయి ధన్సిక నటించిన యోగిడ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన విశాల్ తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఈ వేడుకలో విశాల్ మాట్లాడుతూ.. మొదట్లో తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచాలని అనుకున్నామని, కానీ సోషల్ మీడియాలో తమ సంబంధం గురించి ఊహాగానాలు వస్తున్నాయని చూసిన తర్వాత దానిని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. తాము పదిహేను సంవత్సరాలుగా స్నేహితులమని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..