
దక్షిణాదిలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. ఎన్నో హిట్ చిత్రాలతో మెప్పించాడు. అతడికి దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన నటనకు, ప్రతిభకు ప్రతీకగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఇటీవలే పాన్ ఇండియా మూవీలో అడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ హీరో సినీ ప్రయాణం చాలా ఆసక్తికరం. ఎందుకంటే సామాన్యుడిలాగే కెరీర్ ప్రారంభించారు. రూ.750 జీతానికి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. అదే సమయంలో తన తల్లి బ్యాంక్ లోన్ తీర్చేందుకు అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. అతను మరెవరో కాదు.. కోలీవుడ్ హీరో సూర్య.
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో సూర్య. తెలుగు, తమిళం భాషలతోపాటు హిందీలోనూ అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు గార్మెంట్ కంపెనీలో పని చేసేవాడు. 15 రోజులకు రూ.750 సంపాదించేవాడు. అక్కడే పని కొనసాగించి ఉంటే మూడేళ్ల తర్వాత ప్రతినెలా రూ.8వేల జీతం వచ్చేదని.. ఏదో ఒకరోజు సొంతంగా కంపెనీ పెట్టాలనేది తన ఆలోచన అని గతంలో చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. సూర్య తండ్రి శివకుమార్ సైతం నటుడే. శివకుమార్ కు తెలియకుండా తల్లి లక్ష్మి రూ.25 వేలు బ్యాంకులో రుణం తీసుకుంది. 90వ దశకంలో అది భారీ మొత్తం. ఆ రుణం తీర్చాలనే ఉద్దేశంతో సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు.1997లో నెరుక్కు నాయర్ సినిమాతో వెండితెరకు పరిచమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..