
చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి మాయం అయిపోతుంటారు. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అవుతుంటారు. ఇంకొంతమంది సినిమాల్లో కనిపించపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కనువిందు చేస్తుంటారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది. అందం అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కుంది ఈ భామ. ఆ మధ్య పార్క్ లో సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ఆమె మీద దాడి చేశారు. పొట్టిబట్టలు వేసుకుంది ఆమె పై దాడి చేశారు. ఇంతకూ ఆమె ఎవరంటే..
సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారును కవ్విస్తున్న ఆ చిన్నది ఎవరో కాదు.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి పాపులర్ అయ్యింది.. ఆమె పేరు సంయుక్త హెగ్డే. యంగ్ హీరో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో తన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత సంయుక్త తెలుగులో పెద్దగా నటించలేదు. ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకుంది.
ఆ మధ్య ఈ అమ్మడు ఏదో కాసేపు వర్కవుట్స్ చేసుకుందామని పార్క్‌కి వెళితే అక్కడ ఊహించని షాక్ తగిలింది. కొంతమంది ఆమెపై దాడి చేశారు. బెంగళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ డ్రస్ వేసుకుని పార్కులో డాన్స్, వర్కవుట్స్ చేసింది సంయుక్త. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళ సంయుక్తపై దాడి చేసింది. అంతేకాదు ఆ మహిళకు అక్కడే ఉన్న కొంత మంది పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తూ సంయుక్తపై మండిపడ్డారు. పబ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిరగడంతో ఆమె పై పలువురు పబ్లిక్ ఫైర్ అయ్యారు. ఈ ఘటన 2020లో జరిగింది. అప్పట్లో ఈ వివాదం పెద్ద రచ్చ లేపింది. ఇక ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది. అడపాదడపా సినిమాల్లో కనికనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.