Diwali 2025: అల్లువారింట ఘనంగా దీపావళి సంబరాలు.. సందడి చేసిన కొత్త కోడలు..

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అమావాస్య చీకట్లను తరిమి కొడుతూ దీపాల వెలుతురితో నిండిపోయింది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వరకూ దీపావళి పండగను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి తమదైన శైలిలో సంతోషంగా జరుపుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లువారింట కూడా ఈ ఏడాది దీపావళి పండగను వైభవంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Diwali 2025: అల్లువారింట ఘనంగా దీపావళి సంబరాలు.. సందడి చేసిన కొత్త కోడలు..
Allu Family Diwali 2025

Updated on: Oct 21, 2025 | 8:01 AM

పండగ అంటేనే కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి సరదాగా సంతోషంగా గడిపే సందర్భం. అటువంటిది దీపావళి అంటే దీపాల వెలుగులను తమ కుటుంబంలోని సభ్యులతో పాటు, స్నేహితులకు హితులకు పంచడం. అటువంటి దీపావళి పండగను టాలీవుడ్ తారలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళికి రెండు రోజులు ముందుగా వేడుకలను నిర్వహించి ఆహ్వానం పలికిన బండ్ల గణేష్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి వేడుకల్లో సందడి చేసిన వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా అల్లువారింట దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నట్లు… ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. అల్లు అరవింద్ కుటుంబ స‌భ్యులందరూ ఓకే చోట కలిసి వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తుంది.

అల్లు అరవింద్ దంపతులు తమ కొడుకులు, కోడళ్ళు, మనవలు మనవరాళ్ళతో పాటు… అల్లు శిరిష్ కి కాబోయే భార్య.. అల్లువారింట అడుగు పెట్ట నున్న కొత్త కోడలు కూడా ఈ ఫోటోలో ఉంది. ఫర్పెక్ట్ ఫ్యామిలీ ఫ్యాన్స్ దిల్ ఖుషీ అయ్యేలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..