AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 ఏళ్ల ఎంట్రీ.. 24 ఏళ్లకు కెరీర్‌కు బ్రేక్.. చిన్నవయసులోనే దానికి బానిసయ్యానన్న హీరోయిన్..

17 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది . దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది .

17 ఏళ్ల ఎంట్రీ.. 24 ఏళ్లకు కెరీర్‌కు బ్రేక్.. చిన్నవయసులోనే దానికి బానిసయ్యానన్న హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 20, 2025 | 8:06 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే అంత సులభం కాదు. సినిమా అవకాశాలు అందుకోవడానికి చాలా మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. తప్పటడుగు వేయడం.. లేదా రాంగ్ ఛాయిస్లు ఎంచుకోవడంతో సినీ కెరీర్ క్లోజ్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ హీరోయిన్ 17 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. చిన్నవయసులో నటన మొదలు పెట్టిన ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఊహించని విధంగా 24 ఏళ్లకే కెరీర్ క్లోజ్ అయ్యింది. ఇంతకూ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే ఈ అమ్మడు కూడా పెద్ద సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోయిన్ గా సినిమాలు చేసింది.

కానీ తక్కువ సమయంలోనే కెరీర్ ను క్లోజ్ చేసుకుంది. ఆమె పేరే పూజా భట్. బాలీవుడ్ నటి పూజ భట్ 1972 ఫిబ్రవరి 24న మహేష్ భట్, కిరణ్ భట్ దంపతులకు జన్మించారు. తన తండ్రి మహేష్ భట్ గుజరాత్ కు చెందినవాడు. ఆమె తల్లి ఇంగ్లీష్, స్కాటిష్ , అర్మేనియన్. పూజ భట్ కు సోదరుడు, రాహుల్ భట్, సోదరి షాహీన్, అలియా భట్ ఉన్నారు. పూజ భట్ 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చింది. జఖ్మ్, సడక్ 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడు ఎక్కువకాలం హీరోయిన్ గా సినిమాల్లో రాణించలేకపోయింది.

చిన్న వయసులోనే ఆమె స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తన అందం, నటనా నైపుణ్యంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. కానీ 24 ఏళ్ల వయసులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో హీరోయిన్ గా కెరీర్ కు పులిస్టాప్ పెట్టి దర్శకత్వం వైపు అడుగులేసింది. అయితే ఆమె కెరీర్ క్లోజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. చిన్న వయసులోనే ఆమె మద్యానికి బానిస అయ్యింది. అలాగే ఆమె బోల్డ్ లుక్స్ కూడా వైరల్ అయ్యాయి. వీటితో పాటు మ్యాగజైన్ కవర్ కోసం తండ్రిని ముద్దు పెట్టుకుంది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. ఇవన్నీ ఆమె సినీ కెరీర్ పై ప్రభావం చూపించాయి.

View this post on Instagram

A post shared by Pooja B (@poojab1972)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు